సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల చేరుకున్నారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు వెలుపల క్యూలో కూడా వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులతోపాటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.