మోర్తాడ్ : రేషన్ కార్డులు, సామాజిక పింఛన్‌లను పొందుతున్న లబ్ధిదారులు తెల్ల కాగితంపై కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల ని ప్రభుత్వం ఆదేశించడంతో ఉపాధి కోసం పట్టణాలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లినవారు మళ్లీ పల్లెల వైపు పరుగులు పెడుతున్నారు. ఆగష్టు 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేకు ఇళ్లకు చేరుకున్న వలస జీవులు సర్వే అనంతరం తిరిగి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు ఇంటి దారి పట్టారు. రేషన్‌కార్డులకు బదులు ఆహార భద్రత కార్డులు, పింఛన్‌దారులకు గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అందరు రావల్సిన అవసరం లేకపోయినా దరఖాస్తులపై మళ్లీ నిర్వహించనున్న సర్వేకు అందరు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వలస వెళ్లిన ఎంతో మంది కుటుంబాలతో సహా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. తెల్ల కాగితంపై రాసి దరఖాస్తులను గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించాలి. తర్వాత రెవెన్యూ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయనున్నారు. దరఖాస్తుల సమర్పణ, సర్వేకు అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండక పోతే ప్రభుత్వ పథకాలకు దూరం అవుతామని భావించిన వలస జీవులు మరో సారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
మళ్లీ పల్లెకు..
Published Wed, Oct 15 2014 2:44 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement