దా‘రుణ’ వ్యథ | Huge trouble to the farmers | Sakshi
Sakshi News home page

దా‘రుణ’ వ్యథ

Published Mon, Nov 21 2016 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

దా‘రుణ’ వ్యథ - Sakshi

దా‘రుణ’ వ్యథ

సాక్షి, నెట్‌వర్క్: ‘‘పది రోజుల్నుంచి రుణం కోసం తిరుగుతున్నా.. కొద్దిరోజుల కింద రూ.60 వేలు ఇస్తమన్నరు.. తీరా ఇప్పుడు వెళ్తే ‘పెద్ద నోట్ల రద్దుతో గడబిడ నడుస్తోంది.. రూ.4 వేలు మించి ఇవ్వలేం’’ అంటున్నారు. యాసంగి సాగుకు ఆ పైసలు దేనికి సరిపోతరుు? వడ్డీ వ్యాపారులను అడిగితే సప్పుడు సేత్తలేరు. ఇక వ్యవసాయం ఎలా చేసేది?’’ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూర్‌కి చెందిన మల్లయ్య ఆవేదన ఇది. ఈయన ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది! బ్యాంకుల్లో రబీ రుణం పుట్టక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్నారు. కొత్త రుణం సంగతి దేవుడెరుగు.. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవడానికే నానా తిప్పలు పడుతున్నారు. ఎంత చేసినా.. నోట్ల మార్పిడితో రూ.4,000 మించి రాని పరిస్థితి ఉండడంతో తలలుపట్టుకున్నారు. డిసెంబరు వరకు తాము రుణాల గురించి ఆలోచించే పరిస్థితి లేదని, ప్రస్తుతం రోజువారి నగదు మార్పిడి లావాదేవీల్లోనే నిమగ్నమయ్యామని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు.

 రుణం కోసం రణం..
 అన్ని జిల్లాల్లో రబీ రుణ లక్ష్యాలను ప్రకటించినా.. ఇప్పటికీ ఖరీఫ్ రుణ పంపిణీయే కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రబీ రుణ పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. కొన్ని జిల్లాల్లో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.4 వేలు మించి రైతు చేతికందడం లేదు. వారంలో రూ.20 వేల వరకు వచ్చినా.. సాగు పనులకు ఆ మొత్తం సరిపోదని రైతులంటున్నారు. వచ్చేనెల చివరి దాకా రబీ రుణాల గురించి తాము ఆలోచించే పరిస్థితి లేదని బ్యాంకర్లు రైతులకు ఖరాఖండీగా చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే 10 నుంచి 12 శాతం మేర రుణ పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6.50 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలున్నారుు. రూ.1,405 కోట్ల మేర రబీ రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు లక్ష్యం విధించగా.. ఇప్పటికి రూ.263 కోట్లే ఇచ్చారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్ధితి. ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడవడంతో రుణాలు అందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

 దాటిపోతున్న అదను..
 ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండడంతో యాసంగి (రబీ) సీజన్‌పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. వరుసగా మూడు సంవత్సరాలు వరుస కరువుతో పంట కళ్లజూడని రైతులు ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని భావించారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో ఆదిలోనే వీరి ఆశలపై నీళ్లు చల్లినట్టరుు్యంది. బ్యాంకు రుణాల తర్వాత రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రరుుస్తుంటారు. అరుుతే కేంద్రం నిర్ణయంతో ప్రస్తుతం ఆ దారులు కూడా మూసుకుపోయారుు. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం కూడా భారీగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే చేతికందుతున్నారుు. మరికొద్దిరోజులు వరి కోతలు, పత్తి తీత వంటి పనులు కొనసాగుతాయని అంచనా. ఇందుకు అవసరమైన పనులకు కూలీలకు చెల్లించే డబ్బుల విషయంలోనూ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. పెద్ద నోట్లు వద్దంటూ కూలీలు చెబుతుండడంతో రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ ఎలాగో రూ.4 వేలు సంపాదించి కూలి డబ్బులు చెల్లిస్తున్నారు.
 
 ఎవరూ అప్పు ఇస్తలేరు
 ‘‘సొమ్ము కోసం బ్యాంకుకు వెళ్తే ఇప్పుడు కాదంటున్నారు. 4 ఎకరాల్లో కంది, 3 ఎకరాల్లో పత్తి వేశాను. వాటికి పురుగు మందు కొట్టాలి. నా దగ్గరున్న రూ.500, రూ.1000 నోట్లు చెల్లడం లేదు. ఎవరూ అప్పు ఇస్తలేరు. ఏం చెయాలే..?’’
     - సంగ్రామ్ పటేల్, మందర్న, నిజామాబాద్ జిల్లా
 
 బ్యాంకులు డబ్బివ్వట్లేదు
 ‘‘ఎవరూ పైసలిచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులోళ్లు పది రోజులు ఆగండి అంటున్నారు. వడ్డీ వ్యాపారులు ఇవ్వడం లేదు. రెండెకరాల్లో పంట సాగుకు నారు పోసి ఉంచిన.. పెట్టుబడి దొరికితే పెడతా.. లేదంటే వదిలేయడమే..’’
 -వడ్లకొండ సారుులు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement