జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలుస్వీకరించినశ్వేతా మహంతి బుధవారంమినిస్టర్స్‌క్వార్టర్స్‌లోహోం మంత్రిమహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు.
సాక్షి,సిటీబ్యూరో: విద్య,వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. రెండు రోజుల క్రితం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనా అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతుల కల్పనకు చర్యలు చేపడుతామన్నారు. అంగన్‌వాడీలను సైతం మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తాన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన సేవలు అందేవిధంగా చర్య తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులు చేసేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు కీలకమని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కోర్టు వివాదాల్లో గల ప్రభుత్వ భూములను సైతం దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రభుత్వ భూమి గజం కూడా చేజారకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు శ్వేతా మహంతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment