29 ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు... | Hyderabad Metro open to public from Nov 29th morning, says KTR | Sakshi
Sakshi News home page

మన మెట్రో.. మన నగరం.. నినాదంతో ..

Published Sat, Nov 25 2017 12:21 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Hyderabad Metro open to public from Nov 29th morning, says KTR - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మన మెట్రో.. మన నగరం.. నినాదంతో మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మెట్రో రైలులో ప్రయాణించిన ఆయన శనివారం నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. జంట నగరాలకు మెట్రో రైలు సర్వీసులు మణిహారం అని అన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారని, 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 29న ఉదయం 6 గంటలకు మొదటి రైలు ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రస్తుతం 57 రైళ్లు ఉన్నాయని, ప్రతి రైలుకు మొత్తం 3మూడు కోచ్‌లలో ...వెయ్యిమంది చొప్పున ప్రయాణించవచ్చని, 24 స్టేషన్లకు అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ సాయంతో మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్మార్ట్‌ కార్డును జారీ చేశారని, వీటిద్వారా అనేక సేవలు పొందవచ్చన్నారు. కాగా, మూడు నెలల వరకు రాత్రి 10 గంటల వరకే మెట్రో సేవలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆతర్వాత ఉదయం 5.30 నుంచి రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక రెండు రోజుల్లో టికెట్ల గురించి ప్రకటిస్తారని, సామాన్యుడికి అందుబాటులో టికెట్‌ ధరలు ఉంటాయని కేటీఆర్‌ వెల్లడించారు. మెట్రో రెండో దశకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement