Nagole-mettuguda services
-
29న ఉదయం 6 గంటలకు మెట్రో ప్రారంభం
-
29 ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు...
సాక్షి, హైదరాబాద్ : మన మెట్రో.. మన నగరం.. నినాదంతో మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో రైలులో ప్రయాణించిన ఆయన శనివారం నాగోల్ మెట్రో స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. జంట నగరాలకు మెట్రో రైలు సర్వీసులు మణిహారం అని అన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారని, 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 29న ఉదయం 6 గంటలకు మొదటి రైలు ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం 57 రైళ్లు ఉన్నాయని, ప్రతి రైలుకు మొత్తం 3మూడు కోచ్‌లలో ...వెయ్యిమంది చొప్పున ప్రయాణించవచ్చని, 24 స్టేషన్లకు అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సాయంతో మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్మార్ట్ కార్డును జారీ చేశారని, వీటిద్వారా అనేక సేవలు పొందవచ్చన్నారు. కాగా, మూడు నెలల వరకు రాత్రి 10 గంటల వరకే మెట్రో సేవలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆతర్వాత ఉదయం 5.30 నుంచి రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక రెండు రోజుల్లో టికెట్ల గురించి ప్రకటిస్తారని, సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధరలు ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు. మెట్రో రెండో దశకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. -
మెట్రో టికెట్ ఛార్జీలు ఖరారు
-
మెట్రో రైలు టికెట్ కనీస ధర ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలపై స్పష్టత వచ్చింది. మెట్రో రైలు టికెట్ కనీస ధర రూ.10గా ఖరారు చేసింది. అలాగే నాగోల్ నుంచి మెట్టుగూడకు ప్రయాణించాలంటే ప్రయాణికులు రూ.25 చెల్లించాల్సిందే. గతంలో మెట్రో రైలు టికెట్ కనిష్ట ధర రూ.8, గరిష్ట ధర రూ.19, ఫుల్ డే పాస్ 40రూపాయలుగా ఉండనున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మెట్రో ప్రాజెక్టు వ్యయం పెరగడంతో మెట్రో రైలు చార్జీలను సవరించాలని ఎల్అండ్టీ నిర్ణయించింది. మరోవైపు టికెట్ గరిష్ట ధరపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ విక్రయాలకు త్వరలో వెబ్‌సైట్‌ను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించనుంది. మనం బయలుదేరే స్టేషన్ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్ చేయాలి. రైలు దిగాక స్టేషన్‌లోని ఎగ్జిట్ గేటు వద్ద మరోమారు స్వైప్ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్ అవుతుంది. భవిష్యత్‌లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది. -
ఎస్పీఎఫ్ చేతికి మెట్రో రైలు భద్రత
హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు త్వరలో పరుగులు తీయనుంది. మెట్రో రైలు భద్రతపై నిర్వహణ బాధ్యతలను ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కు అధికార యంత్రాంగం గురువారం అప్పగించింది. దాదాపు 600మంది భద్రత సిబ్బంది నియామకానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. కాగా, ఉగాది నాటికి నాగోల్- మెట్టుగూడ మధ్య మెట్రోరైలు సేవలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. మెట్రో స్టేషన్లు, పార్కింగ్, సర్క్యులేషన్ ఏరియా, వయడక్ట్, ట్రాక్, రైళ్లు, డిపోలు, కీలక వ్యవస్థలు, యంత్రాంగం, ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాంతాలకు ఎస్పీఎఫ్ భద్రత కల్పించనుంది.