మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలపై స్పష్టత వచ్చింది. మెట్రో రైలు టికెట్ కనీస ధర రూ.10గా ఖరారు చేసింది. అలాగే నాగోల్ నుంచి మెట్టుగూడకు ప్రయాణించాలంటే ప్రయాణికులు రూ.25 చెల్లించాల్సిందే. గతంలో మెట్రో రైలు టికెట్ కనిష్ట ధర రూ.8, గరిష్ట ధర రూ.19, ఫుల్ డే పాస్ 40రూపాయలుగా ఉండనున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.