సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి ఎస్టేట్ కారులో భారీగా నగదు పట్టుకున్నారు. ఆ కారు మాగంటి రూపకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారులో దాదాపు 2 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మాదాపూర్ రైల్వే స్టేషన్లో ఈ డబ్బు ఎస్ఓటీ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. ఈ మొత్తం డబ్బు కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న ఒక అభ్యర్థికి చేరుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment