
సైకిల్ యాత్రలో అవినాష్
మారేడుపల్లి: సైకిల్ ప్రయాణం హాబీగా మార్చుకున్న ఓ యువకుడు మూడు దేశాలను 118 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. యాత్ర ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న ఆ యువకుడికి కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ విజయనగర్ పికెట్ కు చెందిన అవినాష్(23) డిగ్రీ పూర్తి చేశారు. అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలన్న తపన అతనిది. కౌచ్ సర్ఫింగ్ సభ్యుల సహకారంతో సైకిల్ పై దేశం మొత్తం తిరుగుతూ అక్కడి పరిస్థితులు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాడు.
మే 20 న సికింద్రాబాద్ పికెట్‌లోని నివాసం వద్ద నుండి సైకిల్ పై బయలుదేరాడు. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం మీదుగా కోల్‌కత్తా చేరుకున్నాడు. అక్కడనుండి థాయ్‌లాండ్‌కు ఫ్లైట్ లో వెళ్ళాడు. థాయ్‌లాండ్ నుండి కంబోడియా, వియత్నాం దేశాల్లో సైకిల్ పై ప్రయాణించాడు. భారత దేశంతో పాటు మూడు దేశాల్లో రోడ్డు మార్గాన సైకిల్ యాత్రను విజయవంతంగా కొనసాగించాడు. ఈ నెల 20 న హైద్రాబాద్ కు చేరుకున్నాడు. తల్లి దండ్రులు గిరిధర్, ఉషాగిరిధర్‌లు కుటుంబసభ్యులు అవినాష్ ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment