హైదరాబాద్ : తాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రభావితం అయ్యానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదర్శాలలో ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలకు తేడా ఏమీ లేదన్నారు. కేవలం ప్రాధ్యాన్యతల్లోనే విబేధాలు ఉన్నాయని వివరించారు. దేశ స్వాతంత్రం గాంధీ ప్రాధాన్యతగా భావించారని, దాంట్లో దళితుల స్థానాన్ని అంబేద్కర్ ప్రయారిటీగా భావించారని తెలిపారు.
అంబేద్కర్ ఎంత సోషలిస్ట్ కావాలో అంత కాలేదని అన్నారు. ప్రస్తుతం కొందరు నాయకులు మతం రంగు పులుముకొని వస్తున్నారని ప్రజలు దాన్ని గమనించాలని కోరారు. ప్రస్తుత రాజకీయాల్లో కులంతో పాటు డబ్బు ప్రభావం పెరిగిందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ లక్ష్యం పూర్తి కాలేదని, అలాగే ఆదర్శవాదుల లక్ష్యాలు కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఆదర్శాల విషయంలో గాంధీ, అంబేద్కర్ల మధ్యలో తేడా లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment