'అవాంతరాలు ఎదురైనా... సైనికుడిలా కొనసాగుతా' | I will continue in congress party, says P Vishnuvardhan reddy | Sakshi
Sakshi News home page

'అవాంతరాలు ఎదురైనా... సైనికుడిలా కొనసాగుతా'

Published Sun, Dec 28 2014 2:04 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

'అవాంతరాలు ఎదురైనా... సైనికుడిలా కొనసాగుతా' - Sakshi

'అవాంతరాలు ఎదురైనా... సైనికుడిలా కొనసాగుతా'

హైదరాబాద్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే ఒక సైనికుడిలా కొనసాగుతానని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తన తండ్రి సర్గీయ పీజేఆర్ 7వ వర్ధంతి సభ జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ పొన్నాల, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లతోపాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిసెంబర్ 12వ  తేదిన హైదరాబాద్లో హైటెక్ సిటీ సమీపంలోని ఓ హోటల్లో జరిగిన వివాహ వేడుకల్లో విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్రెడ్డి మధ్య వివాదం నెలకొంది. అది కాస్తా దాడిగా మారడంతో ఇరు వర్గాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో హోటల్లోని సీసీ ఫూటేజ్లను పరిశీలించిన పోలీసులు విష్ణువర్థన్ రెడ్డిదే తప్పుగా తేల్చారు.

దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. దాంతో ఆయన కోర్టు ద్వారా ముందస్తు బెయిలు పొందారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతోపాటు పలువురు నాయకులు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రి పీజేఆర్ వర్థంతి సభ వేదికగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని విష్ణు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement