మత్తులో చిత్తవుతున్నారు
భిక్కనూరు : యువత మత్తులో జోగుతోంది. తమతోపాటు ఇతరులనూ ఆ గ‘మ్మత్తు’ లోకాలకు తీసుకెళుతోంది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎక్కడినుంచో మత్తు పదార్థాలను దిగుమతి చేసుకొని హైదరాబాద్‌తోపాటు మెదక్ జిల్లాలోని సిద్దిపేటలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో మండల కేంద్రంలో డ్రగ్స్ వ్యాపారం సాగుతోంది. నాలుగేళ్లుగా ఈ వ్యాపారం పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు.. ఇంటర్మీడియట్, డిగ్రీల ను మధ్యలోనే నిలిపివేసి మత్తుపదార్థాల రవా ణా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. మండ ల కేంద్రానికి చెందిన వీరంతా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
వీరు పల్సర్ వంటి భారీ వా హనాలను ఉపయోగిస్తున్నారని, డ్రగ్స్ రవాణాతోపాటు బెట్టింగ్‌లనూ జోరుగా నిర్వహిస్తున్నారని సమాచారం. గంజాయితో పాటు బ్రౌన్ షు గర్, సాక్రిన్ అనే మత్తు మందులను భిక్కనూ రు నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ యువకులు కొందరు హైదరాబాద్‌లో చదువుతున్న తమ స్నేహితుల కళాశాలలకు వెళ్లి కూడా మత్తు మందులను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. భిక్కనూరులో విచ్చలవిడిగా మత్తు మందుల వాడకం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేద న్న విమర్శలున్నాయి.
రోజూ రాత్రి..
డ్రగ్స్ విక్రయిస్తున్న యువకులు రోజూ రాత్రి 9 గంటలకు భిక్కనూరు నుంచి బైక్‌లపై బయలుదేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు మత్తు మందు సేవిస్తారని, సిద్దిపేట, హైదరాబాద్‌లలో డ్రగ్స్ విక్రయిస్తారని సమాచారం. మత్తులో ప్రమాదాలకూ కారణమవుతున్నార ని, తిరిగి మరుసటి రోజు ఉదయం 11 గంట లకు ఇంటికి చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఈజీగా మనీ సంపాదిస్తున్న వీరి ప్యాకెట్లలో రూ. 50 వేలకు తక్కువ కాకుండా డబ్బులు ఉంటాయని సమాచారం.
ఈ యువకులు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకుల కు సైతం మత్తు మందులను అలవాటు చేసి, త మ ట్రాప్‌లో పడవేసేందుకు యత్నిస్తున్నట్లు తె లుస్తోంది. విషయం తెలుసుకున్న మండల ప్ర జలు.. తమ పిల్లలు ఎక్కడ ఈ దురలవాటుకు బానిసలవుతారో అని ఆందోళన చెందుతున్నా రు. వీరికి ఎక్కడి నుంచి మత్తు మందులు సరఫరా అవుతున్నాయి, వీరు ఎవరకి సరఫరా చే స్తున్నారు అన్న విషయమై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.