రేషన్ బియ్యూనికి రెక్కలు!
మహారాష్ట్రకు తరలుతున్న పేదోళ్ల బియ్యం
- విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముమ్మర తనిఖీలు
- రైల్వే స్టేషన్లలో 36 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
మంచిర్యాల టౌన్ : రేషన్ బియ్యూనికి రెక్కలొస్తున్నాయ్..పేదల కడుపు నింపాల్సిన ఈ బియ్యం ఏకంగా రాష్ట్రం సరిహద్దులే దాటిపోతోంది. మహారాష్ట్రలోని వీరూర్‌కు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యూన్ని పథకం ప్రకారం రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాఫియూ కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్,విజిలెన్స్ విభాగాలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర సఫలమవుతున్నారుు. అరుుతే పూర్తిస్థారుులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాల స్థారుులోనే పక్కా ప్రణాళికలను అమలుపర్చే దిశగా పౌర సరఫరాల శాఖ, పోలీసు విభాగం, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సంయుక్తంగా కృషిచేయూల్సిన అవసరముంది.
తద్వారా ఎక్కడికక్కడే బియ్యం రవాణాదారుల ఆటకట్టించే అవకాశాలుంటారుు. బియ్యం అక్రమ రవాణా కారణంగా దారిద్య్రరేఖకు దిగువనున్న వారి ఆకలి తీర్చాలనే సర్కారు మహోన్నత లక్ష్యం నీరుగారుతోంది. రేషన్ దుకాణంలో బియ్యూన్ని కొన్న తర్వాత ప్రజలు ఎందుకు విక్రరుుస్తున్నారు? నాణ్యత లేకపోవడం వల్లా? డబ్బుల కోసమా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సింది సంబంధిత శాఖల అధికారులే. రేషన్ బియ్యూన్ని అమ్మి వచ్చిన డబ్బుతో సన్నబియ్యూన్ని కొంటున్నారా? అనే సందేహాలూ పలువురు వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నాణ్యత పెంచి సరఫరా చేస్తే రేషన్‌కార్డుల లబ్ధిదారులు దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రరుుంచకుండా చేయొచ్చనే అభిప్రాయూలున్నాయ్.గురువారం పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న బియ్యూన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలులో..
కాజీపేట నుంచి నాగ్‌పూర్ వైపు మంచిర్యాల మీదుగా వెళ్తున్న నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల 60 కిలోల రేషన్ బియ్యూన్ని స్వాధీన పర్చుకున్నారు.బియ్యూన్ని తరలిస్తున్న ఓదెలకు చెందిన జీ.తిరుపతి, పెద్దపల్లికి చెందిన ఆర్.మాధవిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని వీరూర్‌కు బియ్యూన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు సుధాకర్‌రావు, రాంచందర్‌రావు, శశిధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
మందమర్రి రైల్వే స్టేషన్లో..
మందమర్రి రూరల్ : అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ ఇత్యాల కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి మందమర్రి రైల్వే స్టేషన్‌లో నాగ్‌పూర్ ప్యాసింజర్ ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 8 క్వింటాళ్ల 50 కిలోల బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో ఎన్‌పోర్స్‌మెంట్ డిప్యుటీ తహశీల్దార్ దత్తు ప్రసాద్, ఆర్‌ఐ శంకర్, వీఆర్‌ఏ మధుకర్ పాల్గొన్నారు.