Vigilance and Enforcement Officers
-
రేషన్ బియ్యూనికి రెక్కలు!
మహారాష్ట్రకు తరలుతున్న పేదోళ్ల బియ్యం - విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముమ్మర తనిఖీలు - రైల్వే స్టేషన్లలో 36 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మంచిర్యాల టౌన్ : రేషన్ బియ్యూనికి రెక్కలొస్తున్నాయ్..పేదల కడుపు నింపాల్సిన ఈ బియ్యం ఏకంగా రాష్ట్రం సరిహద్దులే దాటిపోతోంది. మహారాష్ట్రలోని వీరూర్‌కు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యూన్ని పథకం ప్రకారం రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాఫియూ కట్టడికి ఎన్ఫోర్స్మెంట్,విజిలెన్స్ విభాగాలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర సఫలమవుతున్నారుు. అరుుతే పూర్తిస్థారుులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాల స్థారుులోనే పక్కా ప్రణాళికలను అమలుపర్చే దిశగా పౌర సరఫరాల శాఖ, పోలీసు విభాగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సంయుక్తంగా కృషిచేయూల్సిన అవసరముంది. తద్వారా ఎక్కడికక్కడే బియ్యం రవాణాదారుల ఆటకట్టించే అవకాశాలుంటారుు. బియ్యం అక్రమ రవాణా కారణంగా దారిద్య్రరేఖకు దిగువనున్న వారి ఆకలి తీర్చాలనే సర్కారు మహోన్నత లక్ష్యం నీరుగారుతోంది. రేషన్ దుకాణంలో బియ్యూన్ని కొన్న తర్వాత ప్రజలు ఎందుకు విక్రరుుస్తున్నారు? నాణ్యత లేకపోవడం వల్లా? డబ్బుల కోసమా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సింది సంబంధిత శాఖల అధికారులే. రేషన్ బియ్యూన్ని అమ్మి వచ్చిన డబ్బుతో సన్నబియ్యూన్ని కొంటున్నారా? అనే సందేహాలూ పలువురు వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నాణ్యత పెంచి సరఫరా చేస్తే రేషన్‌కార్డుల లబ్ధిదారులు దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రరుుంచకుండా చేయొచ్చనే అభిప్రాయూలున్నాయ్.గురువారం పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న బియ్యూన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలులో.. కాజీపేట నుంచి నాగ్‌పూర్ వైపు మంచిర్యాల మీదుగా వెళ్తున్న నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల 60 కిలోల రేషన్ బియ్యూన్ని స్వాధీన పర్చుకున్నారు.బియ్యూన్ని తరలిస్తున్న ఓదెలకు చెందిన జీ.తిరుపతి, పెద్దపల్లికి చెందిన ఆర్.మాధవిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని వీరూర్‌కు బియ్యూన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు సుధాకర్‌రావు, రాంచందర్‌రావు, శశిధర్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మందమర్రి రైల్వే స్టేషన్లో.. మందమర్రి రూరల్ : అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ ఇత్యాల కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి మందమర్రి రైల్వే స్టేషన్లో నాగ్‌పూర్ ప్యాసింజర్ ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 8 క్వింటాళ్ల 50 కిలోల బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో ఎన్పోర్స్మెంట్ డిప్యుటీ తహశీల్దార్ దత్తు ప్రసాద్, ఆర్ఐ శంకర్, వీఆర్ఏ మధుకర్ పాల్గొన్నారు. -
గూ గూడెంలో విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం : పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా అపరాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సుమారు 11 గంటలపాటు సాగిన ఈ దాడులలో నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. రికార్డులలో పేర్కొన్నదానికంటే సరుకులు ఎక్కువుగా ఉండటంతో సీజ్ చేశారు. రికార్డులకు , వాస్తవ స్టాకునకు అదనంగా ఉన్న సుమారు రూ.కోటి మూడు లక్షల విలువైన పప్పులు, నూనెలు స్వాధీనం చేసుకొన్నారు. దుకాణదారులపై నిత్యావసరాల చట్టంలోని 6ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు పట్టణంలో ఈ దాడులు గురువారం ఉదయం డీఎస్పీ కె.అనిల్‌కుమార్ పర్యవేక్షణలో మొదలయ్యాయి. తొలుత భీమవరం రోడ్డులోని వెంకటేశ్వర డిపార్డుమెంటల్ స్టోర్సులో సోదాలు సాగాయి. ఈ సంస్థకు సంబంధించి రెండో దుకాణంలో కొన్ని సరుకులు రికార్డులకు అనుగుణంగా ఉన్నాయి. పెసలు వంటి వాటిలో వ్యత్యాసాలు ఉండటంతో సుమారు 23 లక్షల63 వేల 625 రూపాయల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్ఆర్ అండ్‌కో లో సోదాలు చేసి రెండు లక్షల 36 వేల , 547 రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. మహాలక్ష్మి అండ్‌కోలో చేసిన సోదాలలో కందిపప్పు, శనగపప్పు, వేరుశనగ పప్పు, మినపగుళ్లు, పెసర పప్పులలో తేడాలు ఉండటంతో 42 లక్షల 10 వేల 620 రూపాయల సరుకును సీజ్ చేశారు. అప్పిరెడ్డి అండ్ కంపెనీలో వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో 34 లక్షల రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. ఈ దాడులలో సీఐ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ శైలజ, ఏజీపీఓ .ఆర్.సత్యనారాయణరాజు, ఏఓ ఎం.శ్రీనివాసకుమార్‌లు పాల్గొన్నారు. మధ్యవర్తి రిపోర్టులను వీఆర్వోలు కృష్ణస్వామి, వినోద్‌లు రాశారు. రాత్రి 9.30 గంటల వరకు సోదాలు ముగిశాయి. -
రెండు రేషన్ దుకాణాలు సీజ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్‌లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ హరినాథ్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిలు మంఖాల్ గ్రామంలో నరేష్ నిర్వహిస్తున్న ఆరో నంబర్ రేషన్ దుకాణ ంలో తనిఖీలు చేశారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా లేవు, నిర్వాహకులు సమయ పాలన పాటించడం లేదని గుర్తించారు. దీంతో రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా గ్రామంలోని 19వ నంబర్ రేషన్ డీలర్ కప్పల సుగంధ పేరు మీద ఉన్న దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన బాకీ దాసు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమయపాలన, రిజిస్టర్లు సక్రమంగా పాటించడం లేదని తనిఖీలో వెల్లడి కావడంతో ఈ దుకాణాన్నీ సీజ్ చేశారు. రెండు దుకాణాలకు చెందిన స్టాక్ రిజిస్టర్లు, దుకాణాల తాళాలు మహేశ్వరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబురావు, వీఆర్వో రాములకు అప్పగించారు. రేషన్ దుకాణాల్లోని సరుకుల స్టాక్ వివరాలను ఆర్ఐ బాబురావు, వీఆర్వో రాములు నమోదు చేసుకున్నారు. -
173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
దొనకొండ : నల్ల బజారుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 173 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువు పంచాయతీ గుట్టమీదపల్లెలో బుధవారం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సీఐ వి.శ్రీరామ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మనేని వెంకటేశ్వరరెడ్డి రేకుల షెడ్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్కే రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ వంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి వెంకటేశ్వరరెడ్డికి చెందిన రేకుల షెడ్లో 175 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బాధ్యులైపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహశీల్దార్ కేవీ సత్యనారాయణకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూచించారు. పట్టుకున్న బియ్యాన్ని వీఆర్ఓ మాల్యాద్రికి అప్పగించామని సీఐ శ్రీరామ్ తెలిపారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సై సాంబయ్య, సిబ్బంది ఎ.సత్యం, వి.మల్లికార్జున్, రఘురామిరెడ్డిలు ఉన్నారు. మరోచోట 20 క్వింటాళ్లు.. పామూరు : నిబంధనలకు విరుద్ధంగా రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని కంభాలదిన్నె జిల్లా పరిషత్ హైస్కూల్‌కు మధ్యాహ్న భోజన పథకం కోసం స్థానిక పౌరసరఫరాలశాఖ గోడౌన్ నుంచి రెండు ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ రెండు ఆటోలను మండలంలోని నుచ్చుపొద గ్రామం వద్ద అడ్డగించి అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని నిర్దేశించి కాంట్రాక్టర్ వాహనంలో తరలించకపోవడం.. వాహనానికి ఎలాంటి బోర్డు లేకపోవడం.. బియ్య రిలీజ్ ఆర్డర్ లేకపోవడం.. రూట్ ఆఫీసర్ లేకపోవడం.. తదితర కారణాలతో వాహనాలను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. వాహనదారులపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయనతో పాటు ఎస్సై మస్తాన్‌వలి, కనిగిరి ఎఫ్ఐ నాయబ్స్రూల్, ఆర్ఐ జి.పుల్లారెడ్డి, వీఆర్వోలు పి.రమేష్, ఎస్కే ర ఫీ, కాశయ్య ఉన్నారు. ఇంకో చోట 280 కేజీలు.. చీరాలటౌన్ : అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 280 కేజీల రేషన్ బియ్యాన్ని ఆర్ఐ మహేశ్వరి బుధవారం రాత్రి తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పేరాల సాయిబాబా గుడి సమీపంలో ఓ మహిళ రేషన్ బియ్యాన్ని గోనె సంచుల్లో కట్టుకుని ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్ఐ తన సిబ్బందితో దాడి చేయగా ఆ మహిళ బియ్యం అక్కడే వదిలి పరారైంది. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఐ చెప్పారు. తనతో పాటు వీఆర్వోలు రాంబాబు, రాము, సురేష్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
రూ. 25లక్షల విలువైన విత్తనాలు సీజ్
ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ దాడులు నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్‌రోడ్డులోని వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ సీఐ వంశీధర్, డీఈ సుందరబాబు, హెడ్‌కానిస్టేబుల్ రాంబాబులు తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు రూ.35 లక్షల మేర సీడ్స్ విక్రయించినట్లు నిర్థారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలు దుకాణాల్లో నిల్వలు, ఇతర జిల్లాలకు విక్రయాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలతో పాటు విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. వెంకటేశ్వర సీడ్స్‌దుకాణంలో అక్రమంగా ఇతర జిల్లాలకు సీడ్స్ ఎగుమతి చేసినట్లు రికార్డుల ప్రకారం తేలడంతో ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు దుకాణంలో క్రయవిక్రయాలు నిలుపుదల చేయాలని ఆదేశించామన్నారు. షాపులో ఉన్న విత్తనాలకు, రిజిస్టర్లో పొందుపరిచిన లెక్కలకు వ్యత్యాసం ఉండడంతో అక్కడున్న రూ. 25లక్షల పైచిలుకు విలువగల విత్తనాలను సీజ్ చేశామన్నారు. రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలు సీజ్.. మాడుగుల (గుర జాల): విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాలమేరకు మాడుగుల గ్రామంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. మండలంలోని మాడుగుల గ్రామంలో పురుగు మందులు విక్రయిస్తున్న వెంకటలక్ష్మీ ట్రేడర్స్, లక్ష్మీ ట్రేడర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఈ షాపుల్లో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు షాపుల్లో రూ. 5 లక్షల విలువైన 540 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో వెంకట్రావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. గ్రామంలో విజిలెన్సు అధికారుల రాకను పసిగట్టిన యజమానులు తమ షాపులను మూసివేశారు. గురజాల మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డికి మూసివేసిన షాపులను అదివారం, సోమవారం విచారించాల్సిందిగా సూచించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ షేక్ కాశీంసాహెబ్, విజిలెన్స్ ఫారెస్టు అధికారి శ్రీరాములు, గురజాల వ్యవసాయాధికారి బి.అంజిరెడ్డి, గ్రామరెవెన్యూ అధికారి పద్మ, విజిలెన్స్ కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు. 300 బస్తాల వరి విత్తనాలు స్వాధీనం రెంటాల (రెంటచింతల): రెంటాల గ్రామంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వచే సిన 300 బస్తాల వరి విత్తనాలను శనివారం రాత్రి మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పూజల చిన్ననాగేశ్వరావు నివాసంలో లెసైన్స్ లేకుండా నంద్యాలకు చెందిన నీలకంటేశ్వర సీడ్స్ కంపెనీ బీపీటీ వరి విత్తనాల బస్తాలను నిల్వ చేసి బిల్లు లేకుండా విక్రయిస్తున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు జేడీఏ వి.శ్రీధర్ ఆదేశాల మేరకు ఏవో నరసింహారావు, ఏఈవో తారాసింగ్లు దాడిచేసి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందన్నారు. విత్తన బస్తాలను రెంటచింతల మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు ఏవో తెలిపారు. దాడిలో ఇన్చార్జి ఆర్ఐ కటికల బాలయ్య, మార్కెట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైసు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
మండపేట, న్యూస్‌లైన్ : మండపేట, పరిసర గ్రామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడ్డాయి. రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో సుమారు రూ. 4.81 కోట్ల విలువైన సరుకులను సీజ్ చేశారు. మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు. విజిలెన్స్ ఎస్పీ పి.రమేషయ్యా ఆధ్వర్యంలో డీఎస్పీ రామచంద్రరావు, సీఐలు, ఇతర సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మండపేటలోని జానకిరామ, అరవింద్ ఆగ్రోస్, మోదుకూరు సమీపంలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు, ఏడిద సమీపంలోని సీతారామ ఫుడ్స్ రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ధాన్యం, బియ్యం, నూకలు కొనుగోలు, అమ్మకాలు, గోదాముల్లోని సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు బి రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉన్నా, నిర్వహణ సక్రమంగా జరగడం లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రిజిష్టర్‌లోని సరుకుల వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు పొంతన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. నిల్వల మధ్య వ్యత్యాసంతో అరవింద్ ఆగ్రోస్లోని రూ. 1.55 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ ఫ్లోర్ మిల్లులో వారం రోజులుగా బి రిజిష్టర్ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రూ. 78.5 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం, నూకల అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సీతారామ ఫుడ్స్‌లో రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు వ్యత్యాసం ఉండడంతో రూ. 78 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. జానకిరామ రైస్‌మిల్లులో రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలి పారు. ఆయా మిల్లులకు చెందిన నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీ లో సీఐలు గౌస్‌బేగ్, వరప్రసాద్, ఏజీ ఎం. శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎస్కె వల్లీ, డీసీటీఓ రత్నకుమార్, కానిస్టేబుళ్లు పి.గణేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సరుకుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణ , ఇసుక రీచ్‌ల అవకతవకలకు బాధ్యులైన కొంతమంది అధికారులపై నివేదికలు తయారుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 విజిలెన్స్ యూనిట్లలో గుంటూరు అధికారులు అధిక స్థాయిలో కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేశారు.సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఖజానాకు చేరకుండా పన్ను ఎగవేత జరుగుతున్న చోట విజిలెన్స్ అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి రూ.150 కోట్లు లక్ష్యం కాగా, రూ.250 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూర్చి లక్ష్యాన్ని అధిగమించారు. ఆర్థిక సంవత్సరం పూర్తవడానికి ఉన్న మూడు నెలల కాలంలో మరో రూ.40 నుంచి రూ.50 కోట్లు ఆదాయం రావచ్చని విజిలెన్స్ ఎస్పీ ఎంఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, వ్యవసాయం, వాణిజ్య తదితర శాఖలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే 300కు పైగా కేసులు నమోదు చేశారు. దాడులు చేసి వాణిజ్యశాఖ పన్ను ఎగవేతకు సంబంధించి రూ.121 కోట్లు, మైనింగ్ శాఖలో రాయ ల్టీ, సీనరే జీలకు సంబంధించి రూ.9 కోట్లు, వ్యవసాయశాఖకు సంబంధించి రూ.50 కోట్లు ఆదాయాన్ని రాబట్టగలిగారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జిల్లాలో పౌరసరఫరాల శాఖ లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా జాయిం ట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ, పీడీఎస్ బియ్యం, నీలి కిరోసిన్ అక్రమ తరలింపు మాత్రం ఆగడం లేదు. విజిలెన్స్ అధికారుల దాడులే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు వీరి దాడుల్లో రూ.1.45 కోట్ల విలువైన 8826 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకులు తరలిస్తున్న 100 వాహనాలను సీజ్చే శారు. వీటికి సంబంధించి 244 (6ఏ) కేసులు, 86 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 200 మందికి పైగా అరెస్టుచేశారు. బియ్యం అక్రమ తరలింపులో పల్నాడు, నీలి కిరోసిన్ అక్రమాలు రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో చోటుచేసుకోవడం గమనార్హం. వీటిపై ప్రభుత్వానికి 500 నివేదికలు పంపగా, అందుకు బాధ్యులైన కొందరు అధికారులపై చర్యలకు కూడా సిఫార్సు చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరం ప్రభుత్వ ఖజానాకు పన్ను ఎగవేస్తూ అక్రమ మార్గంలో నడిచే సరుకుల రవాణాపై విజిలెన్స్ దృష్టిసారించి, వాహనాల తనిఖీని ముమ్మరం చేసింది. దీని ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యం రూ.2.59 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.2.83 కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయశాఖకు సంబంధించి 59 క్వింటాళ్ల ఎరువులు, పురుగుమందులు, నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల దందాపై నివేదికలు.. బినామీ సొసైటీల పేరుతో నడుస్తున్న ఇసుక రీచ్‌ల వ్యవహారాలపై కూడా విజిలెన్స్ అధికారులు నివేదికలు తయారుచేశారు. అమరావతి, అచ్చం పేట, మల్లాది, జువ్వలపాలెం, తుళ్లూరు, గొడవర్రు రీచ్‌లకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అదేవిధంగా మందుల కొనుగోలులో అక్రమాలపై నిజాలు నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.