ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 24 గంటల్లో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా ఆదివారం తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
ఖానాపూర్(వరంగల్ రూరల్) 5 సెం.మీ, మణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం), ధర్మసాగర్ (వరంగల్ అర్బన్), పెరూర్(జయశంకర్ భూ పాలపల్లి), బెజ్జంకి (సిద్దిపేట్), నర్సంపేట (వరంగల్ రూరల్), ఆత్మకూర్ (వరంగల్ రూర ల్), హుజూరాబాద్ (కరీంనగర్) 4 సెం.మీ. చొప్పున వర్షపాతం శనివారం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment