ఈ-మార్కెట్ | In front of the farmer 'Nam' services | Sakshi
Sakshi News home page

ఈ-మార్కెట్

Published Fri, Mar 18 2016 2:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఈ-మార్కెట్ - Sakshi

ఈ-మార్కెట్

సరుకును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు
అవకాశంపెలైట్‌ప్రాజెక్ట్ కింద బాదేపల్లి
మార్కెట్‌యార్డు ఎంపిక
ఏప్రిల్ 14న లాంఛనంగాప్రారంభం

 
 రైతు ముంగిట్లోకి ‘నామ్’సేవలు
 
జడ్చర్ల: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేయనున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్..నామ్) మరికొద్ది రోజుల్లోనే రైతు ముంగిట్లోకి రాబోతుంది. ఏప్రిల్ 14న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం దేశంలో పెలైట్ ప్రాజెక్ట్ కింద22 మార్కెట్లను, రాష్ట్రంలో ఐదు మార్కెట్‌యార్డులను ఎంపికచేశారు. వాటిలో బాదేపల్లి మార్కెట్‌యార్డుకు స్థానం దక్కింది. ఈ విధానం ద్వారా మార్కెట్‌యార్డుకు విక్రయానికి వచ్చిన ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ ప్రవేశద్వారం వద్ద సరుకుకు సంబంధించి లాట్‌కోడ్ నంబర్ కేటాయిస్తారు. ఇక్కడే రైతుకు సంబంధించిన పూర్తివివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి.

రైతుల నుంచి సరుకులు కొనుగోలుచేసే వ్యాపారులకు లాగిన్, పాస్‌వర్డ్ కేటాయించడంతో వారు కోడ్‌చేసిన ధరలను యార్డులో ఏర్పాటుచేసిన కంప్యూటర్‌లో గాని తమ సొంత మొబైల్, కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. టెండర్ సమయం ముగిసిన వెంటనే కేటాయించిన ధరల వివరాల ఎస్‌ఎంఎస్‌లు సంబంధిత రైతు, కమీషన్ ఎజెంట్, ట్రేడర్‌కు వెళ్తాయి. దీంతో ధరల కేటాయింపులో పారదర్శకతతో పాటు వేగవంతం చోటుచేసుకుంటుంది. సరుకు నాణ్యత గ్రేడింగ్ ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత రైతులు తమ సరుకును ఈ ల్యాబ్ ద్వారా నాణ్యతను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు కొనుగోలుచేసే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లభిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

 బాదేపల్లి యార్డులో ఏర్పాట్ల పరిశీలన
బాదేపల్లి వ్యసాయ మార్కెట్‌యార్డులో ఈ-మార్కెట్ విధానాన్ని అమలుచేసేందుకు గురువారం వ్యవసాయ మార్కెట్ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, ఏడీఎం బాలమణి, నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ అధికారులు వినోద్‌కుమార్, ఆదిల్ పరిశీలించారు. యార్డులో 20 కంప్యూటర్లను ఏర్పాటుచేసేందుకు గదులు, క్యాబిన్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్ర యోగాత్మకంగా యార్డు ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక గదిలో కంప్యూటర్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమావేశమై ఈ-మార్కెట్ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో యార్డు సెక్రటరీ భాస్కరయ్య పాల్గొన్నారు.

 
ఏప్రిల్ 14న ప్రారంభం
వచ్చే నెల 14న బాదేపల్లి మార్కెట్‌లో నామ్(నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు డీడీఎం, ప్రత్యేక అధికారి మల్లేశం ‘సాక్షి’కి వివరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement