► నేడూ రేపు భారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు పుంజు కుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె. రెడ్డి తెలిపారు. దీని ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడిం చారు. ఆ తర్వాత రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.ఇదిలా వుండగా గత 24 గంటల్లో సత్తుపల్లిలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగుళ్లపల్లి, జఫర్‌ఘడ్, కొత్తగూడెంలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
Published Mon, Jun 26 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM
Advertisement