cropping
-
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. నిజంగా ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు ఓ రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ విప్లవాత్మక మార్పు దేశంలో మరెక్కడా అమలుకాని నూతన సాంకేతిక విధానం. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ–క్రాప్ ద్వారా ఏ సర్వే నెంబర్ పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగవుతుందో? వాస్తవ సాగుదారులెవరో? గుర్తించడమే కాదు.. సీజన్లో విత్తనాలు, ఎరువులు, పంట రుణాలతో సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించే సాంకేతిక సౌలభ్యం దీనిద్వారా సాధ్యం.ఏపీ స్ఫూర్తితో గతేడాది పైలెట్ ప్రాజెక్టుగా 12 రాష్ట్రాల్లో అమలుచేసిన కేంద్రం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) పేరిట దేశవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సాంకేతిక బృందం ఏపీలో ఈ–క్రాప్ అమలుతీరును పరిశీలించింది. ఇందులోని ఫీచర్స్‌ను డీసీఎస్‌లో అనుసంధానించేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. గతంలో పొంతనలేకుండా పంట అంచనాలు.. వ్యవసాయ సీజన్ (ఫసల్)లో శిస్తు వసూలు కోసం పూర్వం నీటి వనరుల (కాలువలు, బోర్లు, చెరువుల) కింద సీజన్ ప్రారంభం కాగానే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంటల సాగు వివరాలను అడంగల్‌లో నమోదు చేసేవారు. కాలువల కింద సాగయ్యే పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటìతీరువా వసూలుచేసేవారు. పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రైతులు చెప్పిన సాగు వివరాలనే అడంగల్‌తో పాటు 1–బీలో నమోదుచేసి గణాంక శాఖాధికారులకు అందజేసేవారు. పన్ను భారం తగ్గించుకునేందుకు కొన్నిచోట్ల వివరాల నమోదు తప్పులతడకగా ఉండేది. సాగు చేసేదొకరైతే.. అడంగల్‌లో ఒక పేరు, పాస్‌బుక్‌లో మరొక పేరు ఉండేది. ఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేసేవారో ఖచ్చితమైన సమాచారం దొరకని పరిస్థితి ఉండేది. నేడు పక్కాగా పంట వివరాలు.. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ సీజన్ నుంచి ఈ–పంట నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేస్తున్నారు. తొలుత సీజన్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో రైతులు సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేసేవారు.సీజన్ ప్రారంభమైన 15–30 రోజుల్లోపు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జియో కోఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంట ఫొటోలను అప్లోడ్ చేస్తారు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని, రైతు మొబైల్ నెంబర్‌కు డిజిటల్ రశీదును పంపిస్తారు. వీఏఏ, వీహెచ్‌ఎ, వీఆర్ఏ ధృవీకరణ పూర్తికాగానే మండల వ్యవసాయాధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ర్యాండమ్‌గా పరిశీలించి, చివరగా రైతులకు భౌతిక రశీదు అందిస్తున్నారు.ఈ రశీదులోనే ఉచిత పంటల బీమా పథకం వర్తించేందుకు వీలుగా నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో తెలియజేయడమే కాకుండా మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తుందని పేర్కొనేవారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం పంటల సాగు వివరాలు పక్కాగా నమోదవుతున్నాయి. ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో పంటల వివరాలను నమోదుచేశారు. డీసీఎస్ యాప్‌లో ఈ–క్రాప్ ఫీచర్స్ఏపీలో జాయింట్ అజమాయిషీ కింద నమోదు చేయడమే కాదు.. సోషల్ ఆడిట్ నిర్వహించడం, వాటిని గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో ప్రదర్శించడం, రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడం, వారి వేలిముద్రలు సేకరించి డిజిటల్, ఫిజికల్ ఎక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వడం వంటి ఫీచర్స్ ఈ డీసీఎస్ సర్వే యాప్‌లో లేవు. పైగా గతేడాది నుంచి ఏపీలో జియోఫెన్సింగ్, జియో కోఆర్డినేట్స్‌తో సహా ఈ క్రాపింగ్ చేస్తున్నారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలన్న సంకల్పంతో ఇటీవల న్యూఢిల్లీ నుంచి అగ్రిస్టాక్ విభాగం నుంచి విష్ణువర్థన్, ధృవ్గౌతమ్ వంటి సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న ఈ–క్రాప్ అమలుతీరును పరిశీలించింది. డీసీఎస్ కంటే మెరుగైన ఫీచర్స్‌తో ఈ–క్రాప్ నమోదు చేస్తున్న విధానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఫీచర్లను కూడా డీసీఎస్ సర్వే యాప్‌తో అనుసంధానిస్తున్నట్లు వాళ్లు స్వయంగా ప్రకటించారు. డీసీఎస్‌లో నమోదైన వాస్తవ సాగు సమాచారం ఆధారంగా వచ్చే సీజన్ నుంచి రైతు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.ఈ–క్రాప్ ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు..ఇక సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీతో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను ఈ–క్రాప్ ప్రామాణికంగానే అందేలా కృషిచేశారు. వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీతో పాటు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారం అందించారు. ఉదా.. ⇒ ఈ ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు.. ⇒ 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులు.. ⇒ 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ⇒ అలాగే, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. ⇒ వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. ⇒ 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం.. ⇒ 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ.. ⇒ 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలను అందజేశారు.ఏపీ మోడల్లోనే దేశవ్యాప్తంగా అమలు.. ఇదిలా ఉంటే.. ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌ను పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వంటి సంస్థలతో పాటు పలు విదేశీ ప్రతినిధి బృందాలు సైతం అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రియల్ టైమ్ క్రాపింగ్ నమోదు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ సంకలి్పంచింది.2022లోనే కేంద్ర బృందం ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌పై లోతైన అధ్యయనం చేసి గతేడాది 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ క్రాపింగ్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఖరీఫ్ నుంచి దేశవ్యాప్తంగా డీసీఎస్ అమలుకు ముందుకొచి్చంది. ఇందుకోసం విధి విధానాల రూపకల్పనకు స్టీరింగ్ కమిటీలతో పాటు రాష్ట్రాల వారీగా ఇంప్లిమెంటింగ్ కమిటీలు ఏర్పాటుచేసింది. పైలెట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ, మరికొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలు అడంగల్ డేటా ఆధారంగా డిజిటల్ క్రాపింగ్ చేశారు. ఎమ్నెక్స్ ఇంటర్నేషనల్ ద్వారా డిజైన్ చేసిన యాప్ ద్వారా ఖరీఫ్–2023లో జియో ఫెన్సింగ్ రిఫరెన్స్‌తో డీసీఎస్ చేపట్టారు. కానీ, ఏపీలో పూర్తిగా ఎన్ఐసీ సౌజన్యంతో డెవలప్ చేసిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. -
చిన్న ఐడియాతో నెలకు 20 వేలు సంపాదిస్తున్న రైతు
-
అదనపు ఆదాయం కావాలా?.. అయితే ఇలా చేయండి..
పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా రైతులు ఓ పంట కాలంలో ఒక పంటను మాత్రమే సాగుచేయడం సాధారణం. కానీ ఏక కాలంలో ఒకే భూమిలో రెండు మూడు పంటలను సాగుచేయడంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతర పంటల సాగుతో ఓ పంటలో నష్టం వచ్చినా మరోపంట రైతును ఆదుకుంటోంది. దీంతోపాటు అదనపు ఆదాయం వస్తోంది. మామిడి తోటలున్న రైతులు ఏడాదికోమారు తోట ను విక్రయించి ఆదాయం పొందేవారు. ఇప్పుడు రైతులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నారు. మామిడి తోటలోనే ఏడాదికి మూడు రకాల పంటలను పండిస్తూ ఏడాదికొచ్చే మామిడి ఆదాయంతో పాటు అంతకు మూడు రెట్ల ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి రైతులకెంతో మేలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులో నీటి సౌకర్యం ఉన్న తోటలు 80వేల ఎకరాలు. గత మూడేళ్లుగా మామిడి తోటల్లో ఇతర పంటల సాగు క్రమేణా విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్టు ఉద్యానవన శాఖ తెలిపింది. ఏటా మామిడి ఫలసాయంతోపాటు అంతరపంటల కారణంగా రెట్టింపు ఆదాయం గ్యారెంటీగా దక్కుతుంది. రైతులు మామిడిలో అంతర పంటలుగా బీన్సు, టమాటా, వంగ, బెండ, పసుపు, మిరప లాంటి అంతరపంటలను పండిస్తున్నారు. అలసంద, జీనుగ, పెసర, మునగతో పాటు తక్కువ వ్యవధి పంటలైన ఆకుకూరలను సాగుచేస్తున్నారు. చదవండి: కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు సాగవుతున్న అంతరపంటలు బొప్పాయి తోటలో బీన్సు, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లి, మిరపలో అరటి, టమాటాలో కాకర, దోస, తీగబీన్సు, బీర తదితర పంటలను సాగుచేస్తున్నారు. బంతిపూలలో దోస, కొత్తిమీర, బెండ, బీన్సు, టమాటా, వంగతోటలో బంతి, టమాటలో కాకర లాంటి కాంబినేషన్లు రైతులకు లాభసాటిగా మారాయి. కొందరు రైతులు బొప్పాయిలో బంతి, మిరపలో అరటి, బంతిలో అలసంద, క్యాబేజిలో వెల్లుల్లి, కొత్తిమీర సాలుపంటగా జొన్నలను పండిస్తున్నారు. ఈ విధానాలతో బహుళ లాభాలు పంట సాగుకు అవరసమైన భూసారానికి సేంద్రీయ ఎరువులు, నీటివినియోగం, కూలీలు, క్రిమిసంహారకమందుల ఖర్చు భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పంటకాలం ఆదా అవుతుంది. కాబట్టి ఏటా మూడు పంటల్లో రెండు, మూడు పంటలను మిశ్రమ, అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చు. దీంతో ఓ పంటకు ధర తగ్గినా మరో రెండు పంటలకు ధరలుండే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుకు నష్టాలు వచ్చే అవకాశముండదు. టమాటా రైతులకు ఇదోవరం పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో టమాటా ఎక్కువగా సాగవుతోంది. అయితే టమాటా ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఎకరా పొలంలో టమాటాను సాగుచేసేందుకు దాదాపు రూ.80వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంట దిగుబడి మధ్యలో ఉన్నప్పుడు ఇదే పొలంలో తీగపంటలైన బీన్సు, బీర, కాకర, సొర లాంటి పంటలను సాగుచేస్తే టమాటా పంట అయిపోగానే, అదే కర్రలకు రెండో పంట తీగలను పెట్టుకోవచ్చు. ఫలితంగా పంట పెట్టుబడి తగ్గడంతో పాటు భూమిని కొత్త పంటకు సిద్ధం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. టమాటా ధర లేనప్పుడు, రెండో పంట ఆసరాగా ఉంటుంది. -
సేంద్రియ సాగు.. లాభాలు బాగు
పెరవలి: పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సేంద్రీయ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం రైతులు సేంద్రియ సాగు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. వరిలో 50 బస్తాల వరకూ దిగుబడి పెరవలి మండలంలో సేంద్రీయ పద్ధతిలో వాణిజ్య పంటలైన బొప్పాయి, అరటి, జామ పంటలతో పాటు కూరగాయల పంటలైన వంగ, బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, కాకర పాదులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా వరిసాగు చేసి భళా అనిపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడులు సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలో సేంద్రీయ పద్దతిలో అన్నవరప్పాడు, మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు రైతులతో అవగాహన సదస్సులు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. దీంతో రైతులు ముందుకు వచ్చి సాగు చేపట్టారు. సేంద్రీయ సాగుతో లాభాలు రసాయన ఎరువుల వినియోగం అధికంగా వాడడం వల్ల భూములు చౌడు బారిపోతున్నాయి. అంతేకాకుండా పచ్చిరొట్ట పైర్ల సాగు పట్ల నిర్లక్ష్యం వహించడంతో నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి ప్రధాన భూమిక వహిస్తాయి. అందుకు జనుము, జీలుగ, పిల్లిపిసర వంటి పంటలను వేస్తే భూమికి ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని ఇది మంచి ఫలితం ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. కేవలం కషాయాలు, పశువుల ఎరువుతో ఈ సాగు చేయవచ్చని తద్వారా భూసారం పెరిగి తెగుళ్ళ వ్యాప్తి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెగుళ్ల నివారణ ఇలా పంటలపై వచ్చే తెగుళ్ళ నివారణకు రకరకాల కషాయాలు తయారుచేసి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ళు దరిచేరవు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, నీమాస్త్రం, బీజామృతం, ఘన జీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య వంటి వాటిని తయారుచేసి తెగుళ్ళను నివారిస్తున్నామని రైతులు, అధికారులు చెబుతున్నారు. ఎకరానికి రూ. 50 వేల లాభం అరటి సాగు చేపట్టి రెండేళ్లైంది. గత ఏడాది ఎకరం చేలో లాభం రూ.50 వేలు వచ్చింది. పెట్టుబడి తక్కువ నాణ్యమైన దిగుబడి రావటంతో ఈ పంటకు మార్కెట్టులో మంచి ధర లబించింది. దీంతో ప్రస్తుతం అరటితో పాటు వరి సాగు చేస్తున్నాను. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం మానేసి తెగుళ్ళ నివారణకు కేవలం కషాయాలు వాడుతున్నాం. – ఈ.కన్నయ్య, రైతు, ఖండవల్లి కూరగాయలతో మంచి లాభాలు సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేశాను. గత ఏడాది అర ఎకరం వేస్తే మంచి ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు మూడు ఎకరాల్లో అన్నిరకాల కూరగాయలు పండిస్తున్నాను. పెట్టుబడి తక్కువ.. అంతే కాకుండా భూసారం మెరుగుపడి మంచి దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయమే మేలు. –కె శ్రీరామమూర్తి రైతు, ఖండవల్లి రైతుల్ని ఒప్పించడానికి కష్టపడ్డాం సేంద్రీయ సాగు పెంచాలనే ఉద్దేశ్యంతో రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి వారిని పోత్సహించాం. మొదట ఈ సాగు చేయడానికి రైతులను ఒప్పించడానికి చాల ఇబ్బందులు పడ్డాం. నేడు జిల్లాలో 25,300 మంది రైతులు, 35,340 ఎకరాల్లో సాగు చేసేందుకు మార్గం ఏర్పడింది. ఒక్క పెరవలి మండలంలో 1500 ఎకరాల్లో వివిధ పంటలు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల పంటలు ఉత్పత్తి చేయటం వలన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పర్యటనకు వచ్చి పంటలను స్వయంగా పరిశీలించారు. –తాతారావు, సేంద్రీయ సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ -
బామ్మ బాట.. బంగారం పంట
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఉద్యోగ విరమణ పొందాక ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. వ్యవసాయం చేస్తూ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ సాగుబాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమే జంగారెడ్డిగూడెంకు చెందిన కేసనపల్లి లక్ష్మీకాంతం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా తండ్రి శ్రీరాములు వ్యవసాయదారుడు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1954లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరాను. పోలవరం, కోండ్రుకోట, లక్ష్మీపురం, పైడిపాక, చేగొండపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1992లో ఉద్యోగ విరమణ పొందాను. బాధ్యతలన్నీ తీరిపోవడంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో నాకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. సేంద్రియ ఎరువులతోనే పామాయిల్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు వేసి వ్యవసాయాన్ని ప్రారంభించాను. జామను ఒడిశాలో కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం పామాయిల్, కోకో పంటలు సాగుచేస్తున్నాను. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తదితర పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయమే నా ఆరోగ్య రహస్యం. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనులు ముగించుకుని పొలానికి వెళ్తుంటాను.’ -
మల్లె గుండెల్లో గుబులు
► ప్రాణాలు తీస్తున్న రాజధాని భూసమీకరణ ► పొక్లెయిన్లతో పచ్చని పంటల తొలగింపునకు యత్నం ► తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు ► పదే పదే పంటపై దాడి ► ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలు మంగళగిరి : నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో గల రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ఎంత అవస్థలు పెట్టిందో ఇప్పుడు భూముల చదును అంతకంటే ఆందోళన కలిగిస్తూ ప్రాణాలు తీస్తోంది. మండలంలోని కురగల్లులో కౌలు భూములలోని మల్లె తోటలను అధికారులు తొలగిస్తే అప్పు ఎలా తీర్చాలోనని ఆందోళనతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలిసిన చుట్టుపక్కల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు భయపడుతున్నారు. రాజధానికి తీసుకున్న భూములన్నింటిలో నిర్మాణాలు పూర్తయిన తర్వాతే పూలతోటలు తొలగిస్తామని అప్పట్లో మంత్రులు, అధికార పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడేమో వారానికోసారి తోటల దగ్గరకు పొక్లెయిన్లతో వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి మండలంలోని పూలతోటలు అధికంగా పండే నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాలు తొలి నుంచి భూసమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు గ్రామాల్లో సుమారు 1600 ఎకరాలలో మల్లె తోటలు సాగవుతున్నాయి. నిడమర్రు గ్రామంలో ఇప్పటికి 800 ఎకరాలకుపైగా సమీకరణకు ఇవ్వకుండా రైతులు సాగు చేస్తున్నారు. ఇక బేతపూడి, కురగల్లు గ్రామాల్లోనూ రెండు వందల ఎకరాలకుపైగా సమీకరణకు ఇవ్వని పూల తోటలున్నాయి. అన్నీ కల్లబొల్లి మాటలే.. అయితే మంత్రులు, అధికార పార్టీ నేతలు, అధికారుల మాటలు విని కొందరు రైతులు సమీకరణకు ఇచ్చారు. అందులో సుమారు మూడు వందలకు ఎకరాలకుపైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. మల్లెతోటకు ఏడాదికి రూ. లక్ష వంతున కౌలు చెల్లిస్తున్నారు. ఆయా మల్లెతోటలపై రైతు, కౌలు రైతు, కూలీలు వెరసి నాలుగు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మల్లె తోట ఒకసారి మొక్క నాటితే పది నుంచి పదిహేనేళ్ల వరకు సాగవుతుంది. ఈ నేపథ్యంలో కౌలు రైతులు దీర్ఘకాలం సాగు కోసం కౌలుకు తీసుకుని ఎకరాకు రూ. 2 లక్షలకుపైగా పెట్టుబడి పెడతారు. ఇప్పుడు అర్ధంతరంగా పూలతోటలను తొలగిస్తే ఎలా జీవిస్తామని ప్రశ్నిస్తున్నారు. దీంతో పూల తోటల తొలగింపును అడ్డుకుంటున్నారు. అనేక గ్రామాల్లోని భూముల్లో పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయని, ముందుగా వాటిని తొలగించాలని రైతులు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లను కలిసి విన్నవించారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా పచ్చని తోటలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
► నేడూ రేపు భారీ వర్షాలు హైదరాబాద్: ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు పుంజు కుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె. రెడ్డి తెలిపారు. దీని ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడిం చారు. ఆ తర్వాత రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.ఇదిలా వుండగా గత 24 గంటల్లో సత్తుపల్లిలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగుళ్లపల్లి, జఫర్ఘడ్, కొత్తగూడెంలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
పుట్టగొడుగులు పెంచుదామా..
పుట్టగొడుగుల పెంపకం ఇలా.. పుట్టగొడుగులను వరిగడ్డి, చిట్టు, తవుడు, చెరకు దవ్వ, జొన్నచొప్ప లాంటి ఏ రరమైన వ్యవసాయ పదార్థాల పైనైనా పెంచవచ్చు. వీటిలో లిగ్నిస్, సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. పెంచే పద్ధతి కూడా చాలా సులువైనది. ప్రారంభ పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. ఏమేం సామగ్రి కావాలంటే.. పూరిపాక, గది లేక పక్కా షెడ్, వినియోగంలోని కోళ్ల షెడ్ అయినా ఫర్వాలేదు. గడ్డి కత్తిరించడానికి కట్టర్, వేలాడదీయడానికి ఏర్పాటు అంటే పైకప్పుకు కడ్డీలు లేక కొక్కేలు లేక 3-4 అరలున్న చెక్క ర్యాక్, గడ్డిని ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర, నాణ్యమైన స్పాన్(పుట్టగొడుగుల విత్తనం) బెడ్స్‌పై గదిలో ఇసుక, గోనె సంచులపై నీరు చల్లడానికి స్ప్రేయర్లు, మంచి ఎండుగడ్డి, జొన్పచొప్ప, వరి ఊక, బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు, సంచుల మూతులు కట్టడానికి దారం లేక రబ్బరు బ్యాండ్లు, థర్మామీటర్, హైగ్రోమీటర్(ఆర్ధ్రతా మాపకం), చేతులు శుభ్రం చేసుకునేందుకు దూది, స్పిరిట్ లేదా డెటాల్, ఫార్మాలిన్ ద్రావణం అవసరమవుతాయి. సబ్స్ట్రాట్(ఆధారం) తయారు చేసే పద్ధతి నీటిలో ఉడకబెట్టడం ద్వారా సబ్స్ట్రాట్ని స్టెరిలైజ్ చేయవచ్చు. తాజా వరిగడ్డి లేక మరే ఇతర వ్యవసాయ వ్యర్థాన్ని తీసుకుని 2-3 అంగుళాల పొడవున్న ముక్కలుగా కత్తిరించాలి. ఆ ముక్కలను 12-18 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీటిలో కడగాలి. గడ్డి ముక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. మరుగుతున్న నీరున్న పాత్రలో 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం వాటిని తీసి చాపలపై పరచాలి. బెడ్స్ తయారీ.. బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు వాడాలి. 12ఁ18 అంగుళాలు లేదా 100జీ మందంతో 14ఁ24 అంగుళాలు ఉండాలి. గాలి వెళ్లేందుకు వీలుగా పాలీథిన్ సంచులకు 9-15 రంధ్రాలు చేయాలి. చేతులను డెట్టాల్ లేదా స్పిరిట్‌తో శుభ్రం చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసిన గడ్డిముక్కలను పొరలు పొరలుగా బ్యాగ్‌లో నింపాలి. ఎక్కడా ఖాళీ లేకుండా గుండ్రంగా ఉండేలా గడ్డిని నొక్కాలి. గుప్పెడు విత్తనాలను(40 గ్రాములు) బెడ్ ఉపరితలంపై ఒకే రీతిలో చల్లాలి. ఈ విధంగా 4-5 పొరలు తయారు చేయాలి. బ్యాగ్ మూడొంతులు నిండాక విత్తనాలను మరోసారి ఉపరితలమంతటా సమంగా చల్లాలి. తర్వాత బ్యాగును దారం లేదా రబ్బరు బ్యాండుతో బిగించి కట్టి, తేదీ రాసిన లేబుల్ అతికించాలి. ఇంక్యుబేషన్, క్రాపింగ్ బెడ్స్‌తో కూడిన సంచులను చీకటిగా ఉన్న గదిలో వేలాడదీయడమో లేదా షెల్ఫ్ పై పెట్టడమో చేయాలి. ఆ విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వ్యాధులు, పురుగులను నివారించవచ్చు. ఇంటిలో ఒకమూల భాగాన్నయినా ఇందుకోసం వాడుకోవచ్చు. బెడ్స్‌పై ఉన్న సంచులను ర్యాక్‌లపై ఉంచాలి లేదా కొక్కేలకు వేలాడదీయాలి. 18-25 రోజులపాటు బెడ్స్‌ను ఉంచాలి. ఇంక్యుబేషన్ కాలంలో పాలిథిన్ సంచులలోని బెడ్స్‌పై తెల్లని నూలుదారాల వంటి మైసీలియంలు పెరగడం కనిపిస్తుంది. అప్పుడు ప్లాస్టిక్ కవరును తొలగిస్తే పుట్టగొడుగులు పెరగడానికి వీలుంటుంది. బెడ్స్‌లో తేమ ఉండేలా అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. 5-6 రోజుల తర్వాత బెడ్స్ అంతటా సూదిమొనంత ఉన్న పుట్టగొడుగులు కనిపిస్తాయి. 7 నుంచి 10 రోజుల్లో మొదటి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. రేకులు పూర్తిగా విచ్చుకుని అంచులు పలచబడితే ఆ పుట్టగొడుగులు కోతకు వచ్చినట్లే. వాటిని అడుగున కొద్దిగా మెలితిప్పి కాండంతో సహా గిల్లివేయాలి. ఒక్కో దిగుబడిని ప్లస్ అంటారు. వారానికి ఒకసారి కోయాలి. ఒక్కో బెడ్ నుంచి కనీసం 2-3 పంటలను తీయవచ్చు. ఒక్కో బెడ్ నుంచి 500 నుంచి 800 గ్రాముల పుట్టగొడుగులను పొందవచ్చు. తర్వాత బెడ్‌ను తీసివేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. పుట్టగొడుగుల్లో రకాలు పుట్టగొడుగుల్లో తినేందుకు వీలైన జాతులు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. వాటిలో మూడు జాతులను మనదేశంలో పెంచుతున్నారు. అవి వైట్ బటన్(అగారికస్ స్పీషిస్), అయిస్టర్ లేక థింగ్రీ(ఫెయిరోటస్ స్పీషిస్), చైనీస్(ఓల్వోరిల్లా స్పీషిస్). వైట్ బటన్ : దీనిని యూరోపియన్ లేక సమశీతోష్ణ(టెంపరేట్) పుట్టగొడుగులు అని కూడా అంటారు. వీటి పెంపకానికి 15-18 డిగ్రీల సెంటిగ్రేడ్ నియంత్రిత ఉష్ణోగ్రత కావాలి. అందుకోసం ఇన్సులేటెడ్ గదులు, ఏసీ ఫ్లాంట్, హ్యుమిడిఫైయర్, ఏహెచ్‌యూ లాంటి యంత్రాలు అవసరం. అందువల్ల పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెంపకానికి సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ రకాన్ని సాధారణంగా చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో పెంచుతారు. మన రాష్ర్టంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. అయిస్టర్(ముత్యపుచిప్ప) : ఈ రకం పుట్టగొడుగులను చౌకగా లభించే రకరకాల వ్యవసాయ వ్యర్థ పదార్థాలపై పెంచవచ్చు. ఉష్ణోగ్రత 25-32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. తేమ శాతం 75-85 ఉండాలి. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రకాలను మన రాష్ట్రంలో పెంచుకోవచ్చు. చైనీస్ : ఈ రకానికి 35-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ అవసరం. అత్యధిక ఉష్ణోగ్రత అవసరమైనందున ఈ రకాన్ని వేసవిలో పెంచుకోవచ్చు.