
చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరి గినప్పుడల్లా కేసీఆర్ తన స్వగ్రామానికి వె ళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి చింతమడక వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించారు.