
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ టౌన్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పైపులైన్లలో లీకేజీలను అరికట్టాలని, ప్రతి నీటిచుక్కనూ సంరక్షించాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందించాలన్నారు. బోర్ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
ఇంకా అవసరం అనుకుంటే కొత్త బోర్లు వేయాలని సూచిం చారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు అందేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు ప్రతినెల రేషన్ సరుకులు అందుతున్నాయో లేదోతనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో శానిటేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహిం చాలన్నారు. ఉపాధిహామీలో నిబంధనలకు అనుగుణంగా కూలీలకు పని కల్పిం చాలని, చేసిన పనికి డబ్బులు సకాలంలో చెల్లించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో భాగంగా వన నర్సరీలను సమర్ధవంతం గా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డీఓ హన్మంతరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందారాణిలు పాల్గొన్నారు.