‘డిండి’ భూసేకరణ వేగం పెంచండి
♦ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
♦ 2013 చట్టం ప్రకారమే సేకరించాలని సూచన
♦ డిండి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల కింద భూసేకరణను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికా రులను ఆదేశించారు. ప్రస్తుతానికి 2013 భూసేకరణ చట్టం కింద భూములను సేకరిం చాలని, దీనిలో ఇబ్బందులు తలెత్తిన చోట స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల లెక్క ప్రకారమే పరిహారం ఇవ్వాలని చెప్పా రు.
బుధవారం డిండి, ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు, ఉదయ సముద్రం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంగంబండ పథకం తదితరాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి సమీక్షించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, బాలరాజు, భాస్కరరావు, ప్రభాక రరెడ్డి, స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, పలు జిల్లా ల కలెక్టర్లు పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల భూసే కరణ, పనుల పురోగతి, ఇతర సమ స్యలపై కలెక్టర్లు వారానికోసారి సమీక్షిం చాలని.. కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు ఆ సమావే శాల్లో పాల్గొనాలని మంత్రి ఆదేశించారు. రంగా రెడ్డి జిల్లా మాడ్గుల, ఆమనగల్ మండ లా లకు కల్వకుర్తి లిఫ్ట్ పథకం నీరందించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు.
భూగర్భ జలాలపైనా సమీక్ష
భూగర్భ జలాల వినియోగంపై ఆ విభాగం అధికారులతో హరీశ్‌రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా సాగు పెరిగిం దని మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రతి జిల్లాలో ఒక్కో చోట ప్రయోగాత్మకంగా భూగర్భజలాల రీచార్జి అధ్యయనాలు చేయాలని మంత్రి సూచించారు.