సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధి లోని ముంపు ప్రాంతాల నిర్వాసితులకు జరుగుతున్న పునరావాస సహాయ పంపిణీపై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, నీటి పారుదల శాఖల కీలక అధికారులంతా ఇందు లో పాల్గొన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, శింగారం, ఎర్రవల్లి, రాంపూర్, లక్ష్మాపూర్ తదితర గ్రామాల్లో నిర్వాసితులకు అందిస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ఆరా తీశారు. ఈ నెల 13 నాటికి నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రి యను ముగించాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం అందించే కార్యక్రమం, గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో జరుగుతున్న చెక్కుల పంపి ణీని అడిగి తెలుసుకున్నారు.
హైకోర్టులో ఈ నెల 15 లోగా పునరావాస పంపిణీకి సంబంధించిన అఫిడవి ట్‌ను ప్రభుత్వం సమర్పించాల్సి ఉన్నందున ఇప్పటి వరకు జరిగిన పరిహారం పంపిణీ వివరాలతో హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం తీసుకునేందుకు వెనకాడుతున్న నిర్వాసితుల అభిప్రాయాలను వీడియో తీసినందున వాటిని కోర్టు ముందుంచాలని సూచించినట్టు తెలిసింది. కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్, అడిషనల్ ఏజీ రామచంద్రరావు, ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment