మండలాధీశుల ఎన్నిక నేడే | Indirect elections to MPP and Vice-MPP | Sakshi
Sakshi News home page

మండలాధీశుల ఎన్నిక నేడే

Published Fri, Jul 4 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

Indirect elections to MPP and Vice-MPP

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మండల పరిషత్ అధ్యక్ష పదవులను అత్యధికంగా తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ ము మ్మరంగా ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని మొత్తం 36 మండలాల్లో ఇప్పటికే 19 మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన ఎంపీపీలు, ఉపాధ్యక్షులు ఎన్నికయ్యేందుకు స్పష్టమైన మెజార్టీ ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కాంగ్రెస్, టీడీపీలకు చెం దిన ఎంపీటీసీ సభ్యులు, స్వతంత్రులు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో మరో నాలుగు స్థానాలు టీఆర్‌ఎస్ కు పెరిగే అవకాశం ఉంది.

 ఇందూరు జిల్లాపై దృష్టి సా రించిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ నగర పాలక సం స్థ, ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీలతో పాటు జడ్పీ, మెజార్టీ మండల పరిషత్‌లను కైవసం చే సుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పీఠాలను కైవసం చేసుకునేం దుకు మంత్రికి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఎంపీ లు, ఎమ్మెల్యేలు సైతం సర్వశక్తులొడ్డాలని సూచించిన ట్లు సమాచారం. కాగా మరో రెండు రోజుల్లో మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనుండగా క్యాంపు రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలకు ప్రతిష్టాత్మకం
 మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలకు పరీక్షగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం రెండు ఎంపీ, 9 అసెంబ్లీ స్థా నాల్లో గెలిచిన టీఆర్‌ఎస్ మున్సిపల్, పరిషత్ ఎన్నిక ల్లో సత్తా చాటాలని చూస్తోంది. పరిషత్, మున్సిపల్ ఎ న్నికల్లో టీడీపీ పూర్తిగా దెబ్బతినగా... దిగ్గజాలైన నేతలున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఓ వైపు క్యాంపు రాజకీయాలు నడుపు తూ.. మరో వైపు ఆపరేషన్ ‘ఆకర్ష్’తో గాలం వేస్తూ సర్వశక్తులొడ్డుతున్నారు.

మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు 24 కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ మూడోసారి ఇం దూరు జడ్పీపై గులాబీ జెండా ఎగుర వేయనుండగా.. మెజార్టీ ఎంపీపీ స్థానాలపై దృష్టి సారించింది. ఎంపీటీ సీ ఎన్నికల్లో 583 స్థానాలకుగాను టీఆర్‌ఎస్ 240 ద క్కించుకోగా.. కాంగ్రెస్‌కు 225, బీజేపీకి 34, టీడీపీకి 31, ఎంఐఎంకు  2 స్థానాలు దక్కగా, 49 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. అ యితే ఫలితాల అనంతరం అనేక మంది పార్టీలు మా ర్చారు. ఆ మార్పు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా మారిం దంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తమ ఎం పీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి చేరుకుం టుందోని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

 ‘హంగ్’ స్థానాలపై వ్యూహం
 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ‘హంగ్’ స్థానాలపై టీ ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించా యి.స్వతంత్రులను తమవైపు తిప్పుకుని పీఠాలు సాధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నందిపేటలో 20 ఎంపీటీసీ స్థానాలకుగాను కాం గ్రెస్ 8, టీఆర్‌ఎస్ 6 గెలవగా, ఇక్కడ స్వతంత్రులు కీలకంగా మారారు. రెంజల్ మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలుం డగా ఇందులో 5 కాంగ్రెస్ పార్టీ, 4 బీజేపీ, 2 టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు గెలిచారు. ఇక్కడ హంగ్ ఏర్పడింది.

మోర్తాడ్‌లో పదహారు ఎంపీటీసీ సభ్యులకు గాను కాం గ్రెస్ శిబిరంలో ఎనిమిది మంది, టీఆర్‌ఎస్ శిబిరంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. రెండు పక్షాల్లో సమానంగా ఎంపీటీసీ సభ్యులు ఉండటంతో టాస్ ద్వారా ఎన్నిక జరుగుతుందా? లేక జంప్‌జిలానీలతో ఫలితా లు తారుమారవుతాయా? అన్న ఉత్కంఠ నెలకొంది. భీమ్‌గల్ మండలంలోను 18 ఎంపీటీసీ స్థానాలకు గా ను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సరిసమానంగా ఎం పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇక్కడి ఎన్నికపై కూడ ఉత్కంఠ నెలకొంది.

 మాచారెడ్డి మండలంలో 17 ఎం పీటీసీలు ఉండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి ఎని మిది మంది చొప్పున గెలవగా.. ఇండిపెండెంట్‌లపైన్నే ఎంపీపీ స్థానం ఆధారపడి ఉంది. ధర్పల్లి మండలంలోని 14 స్థానాలకు గాను  కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, టీఆర్‌ఎస్ 5, టీడీపీ 1, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకోగా, ‘హంగ్’ పరిస్థితి నెల కొంది. ఇలా చాలాచోట్ల ‘హంగ్’ పరిస్థితి నెలకొనగా.. ఆ స్థానాల్లో ఎంపీపీ స్థానాలు కీలకంగా మారాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement