Mandal Parishad president
-
సూరీడమ్మ ఔట్
జి.సిగడాం: వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచి.. తీరా ఆ పార్టీ విప్‌నే ధిక్కరించి తెలుగుదేశం మద్దతుతో జి.సిగడాం మండల పరిషత్ అధ్యక్ష పీఠం అధిష్టించిన డొంక సూరీడమ్మకు ఆ ముచ్చట మూడు నెలల్లోనే ముగిసింది. ఎన్నికల అధికారులు అనర్హత వేటు వేయడంతో ఆమె పదవి కోల్పోయారు. ఈ ఏడాది జూలై 4న జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో సూరీడమ్మ విప్ ధిక్కరించి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని మండల వైఎస్ఆర్సీపీ విప్, వాండ్రంగి ఎంపీటీసీ సభ్యుడు ఈసర్ల గోవిందరావు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన మండల ఎన్నికల అధికారి సుదర్శనదొర ఆదేశాల మేరకు సూరీడమ్మను ఎంపీపీ పదవికి అనర్హురాలిని చేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని శనివారం అందజేసినట్లు ఎంపీడీవో కె.హేమసుందరరావు తెలిపారు. జి.సిగడాం ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. అలాగే మండలంలోని గెడ్డకంచరాం, డీఆర్‌వలస ఎంపీటీసీ స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దాంతో ఈ రెండు స్థానాల్లో గెలుపొందిన వారిలో ఒకరు ఎంపీపీ పదవి చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన డొంక సూరీడమ్మ. మామిడి బలరాంలు విజయం సాధించారు. జూలై నాలుగో తేదీన జరిగిన ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థిగా డీఆర్‌వలస ఎంపీటీసీ మామిడి బలరామ్‌ను నిలబెట్టిన వైఎస్ఆర్సీపీ, అతన్నే బలపరచాలంటూ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే ఎంపీపీ పదవిపై ఆశపడిన సూరీడమ్మ ఆ విప్‌ను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో విప్ ధిక్కరించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా ఎంపీపీ పదవి చేపట్టిన 96 రోజుల్లోనే సూరీడమ్మ అధికారానికి పదవులకు దూరమయ్యారు. -
అసామాన్యులు
అదృష్టం ఏరూపంలో వరిస్తుందో..ఎవరు చెప్పగలరు. రాజయోగం రాసిపెట్టి ఉంటే తనకు కానిది కూడా వశమవుతుందంటారు. అదే మాదిరిగా నిన్న మొన్నటి వరకు సామాన్య మహిళలుగా ఉన్న వారు అస‘మాన్యు’ల య్యారు.. కొందరికి రిజర్వేషన్లతో కాలం కలిసొచ్చింది. మరికొందరిని అదృష్టం వరించింది. ఏదైతేనేం.. నేడు వారంతా మండల పరిషత్ అధ్యక్షులయ్యారు. వ్యవసాయ కూలీలు.. గృహిణులు.. రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యులకూ అధికారం చేరువైంది. తమ వ్యక్తిగత పనులు చేసుకుంటూనే అధ్యక్షులుగా పరిపాలనపై దృష్టిసారిస్తున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన వారిపై ప్రత్యేక కథనం.. వ్యవసాయ క్షేత్రం నుంచి.. ఆత్మకూర్(ఎస్) : కొద్ది రోజుల క్రితం వరకు ఆమె అందరిలాగే సాధారణ గృహిణి. వ్యవసాయ పనుల్లో భర్తకు సాయపడుతూ ఉండేది. నేడు మండల అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుని వీఐపీగా మారింది. ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కసగాని లక్ష్మీబ్రహ్మయ్య గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. అయినా నిరుత్సాహానికి గురికాకుండా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందింది. ఎంపీపీ అధ్యక్ష పీఠం బీసీ జనరల్‌కు కేటాయించినా ఆమెకే అదృష్టం వరించడంతో మండల అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వంటింటి నుంచి.. మండల పరిషత్‌కు హాలియా : మండల పరిషత్ అధ్యక్షురాలు అల్లి నాగమణి రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె భర్త అల్లి పెద్దిరాజు బోయగూడెం సర్పంచ్‌గా పని చేయడంతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. భర్త క్రీయాశీలక రాజకీయాల్లో ఉండడంతో ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఇంటికి వచ్చేవారు. దీంతో రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో మండల పరిషత్ అధ్యక్ష స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సీఎల్పీ నేత జానారెడ్డి విజ్ఞప్తి మేరకు గరికేనాటితండ నుంచి నాగమణి పోటీ చేసి ఎంపీటీసీగా గెలుపొందింది. జానారెడ్డి మద్దతు, పార్టీ ఎంపీటీసీల సహకారంతో ఎంపీపీగా పాలన పగ్గాలు చేపట్టింది. సమభావన సంఘం లీడర్‌గా.. నూతనకల్ : నూతనకల్ ఎంపీపీగా గెలుపొందిన కాసోజు సుమలత సమభావన సంఘం గ్రూపు లీడర్. గతంలో పెద్దనెమిల గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా పనిచేసింది. భర్త మదనాచారితో పాటు అత్త గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. కుటుంబ రాజకీయ నేపథ్యం, రాజకీయాలపై ఉన్న ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహనతో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పెద్దనెమిల ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందింది. రిజర్వేషన్లలో భాగంగా మండల పరిషత్ అధ్యక్ష పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఎం సహకారంతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకుంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు.. హుజూర్నగర్ : మండలంలోని కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల నిర్మల హుజూర్నగర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు ఆమె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకురాలిగా పనిచేశారు. విద్యార్హత కేవలం 9వ తరగతి మాత్రమే. అయినప్పటికీ ఆమెకు అదృష్టం వరించింది. గ్రామ ఎంపీటీసీ, ఎంపీపీ స్థానం కూడా ఎస్సీ మహిళకే కేటాయించడం నిర్మలకు కలిసివచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోగా పార్టీ నుంచి గెలుపొందిన వారిలో నిర్మల మాత్రమే ఎస్సీ మహిళ కావడంతో ఎటువంటి పోటీ లేకుండానే ఎంపీపీగా ఎన్నికైంది. కూలి మేస్త్రి నుంచి... గరిడేపల్లి : వ్యవసాయ పనులకు కూలీలను తీసుకువచ్చే మహిళా గరిడేపల్లి ఎంపీపీ పీఠాన్ని అధిరోహించింది. భీమపంగు సోమమ్మ కూలీల మేస్త్రిగా సర్వరాంలో ప్రజలందరికీ సుపరిచితురాలే. రాత్రి బడికి వెళ్లి తన పేరు రాయడం నేర్చుకుంది. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సర్వరారం ఎంపీటీసీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచింది. కాగా ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో సోమమ్మ ఒక్కరే ఎస్సీ కావడంతో స్వతంత్ర, సీపీఐ సభ్యుల మద్దతుతో మండల పరిషత్ అధ్యక్షురాలిగా నిలిచింది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సంస్థాన్ నారాయణపురం : రిజర్వేషన్లతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళలు పదవీ కాలం ముగిసిన తర్వాత చాలా వరకు ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ పీఠాన్ని అధిరోహించింది వాంకుడోతు బుజ్జి. సీత్యాతండాకు చెందిన బుజ్జి 1996లో రిజర్వేషన్లో భాగంగా భర్త శ్రీను ప్రోత్సాహంతో వావిళ్ళపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2002లో సాంఘిక సంక్షేమ రాష్ట్ర డెరైక్టర్ గా, 2006లో జెడ్పీటీసీ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వావిళ్ళపల్లి ఎంపీటీసీ-2 స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ రాజకీయ సమీకరణలతో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. రెండుసార్లు ఓడి.. మూడోసారి గెలిచి భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రానికి చెందిన సార సరస్వతి మూడుసార్లు స్థానిక ఎన్నికల్లో ఓడిపోయి మూడవ సారి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ అయ్యింది. టెన్త్ వరకు చదువుకున్న సరస్వతి సాధారణ గృహిణి. భర్త సార బాలయ్య రిైటె ర్డ్ ఆర్టీసీ ఉద్యోగి. మొదటి సారిగా 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోచంపల్లి-3 ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయింది. 2006లో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకుంది. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి ఓడింది. తిరిగి ఇటీవల జరిగిన మండల ప్రాదేశిక ఎన్నికలలో పోచంపల్లి-4 ఎంపీటీసీ పోటీ చేసి గెలిచింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా గెలవడానికి మెజార్టీ లేకున్నా మారిన రాజకీయ సమీకరణాలు ఆమెకు ఉపకరించాయి. టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఎంపీపీగా నిలిచింది. భర్త ప్రోత్సాహంతో.. పెద్ద అడిశర్లపల్లి : పీఏపల్లి మండల పరిషత్ పీఠాన్ని అధిరోహించిన మేడారం రాజమ్మ ఏడోతరగతి మాత్రమే చదువుకుంది. అందరి మాదిరిగానే సాధారణ గృహిణి. రాజమ్మ భర్త నారాయణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య కార్యకర్త. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మేడారం గ్రామ ఎంపీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో భర్త ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందింది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయిన నేపథ్యంలో అధ్యక్షత స్థానం కోసం పార్టీ నుంచే ముగ్గురు పోటీకి వచ్చినా రాజమ్మకే ఎంపీపీ పీఠం వరించింది. మొదటిసారిగా రాజకీయాల్లోకి.. హాలియా : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన వస్త్రపురి మల్లిక 26ఏళ్లకే పెద్దవూర ఎంపీపీ పదవి చేపట్టింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. భర్త సాధారణ రైతు. మల్లిక కుటుంబంపై ఉన్న గౌరవంతో చింతలపాలెం-1 ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వుకావడం కూడా మల్లికకు కలిసివచ్చింది. ఏకగ్రీవంగా ఎంపికైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎంపీపీ పదవి చేపట్టింది. ప్రజలందరి సహకారంతో ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యా.. వారి రుణం తీర్చుకోవడం కోసం కృషి చేస్తానని పేర్కొంటోంది. -
దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార బలంతో టీడీపీ నాయకులు హద్దుమీరారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవడానికి దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. పలుచోట్ల కిడ్నాప్‌లకు సైతం పాల్పడ్డారు. హంగ్ ఉన్న స్థానాలకు కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. పలువురిని రకరకాల ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేశారు. జిల్లాలో 53 మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా 27 స్థానాలను టీడీపీ చేజిక్కించుకుంది. ప్రజాబలంతో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 24 మండల పరిషత్‌లను కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాయలసీమ పోరాట సమితి(ఆర్పీఎస్) ఒక స్థానంతో సరిపెట్టుకొంది. కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక పెండింగ్ పడింది. కిడ్నాప్‌లు.. బెదిరింపులు ప్యాపిలి మండల పరిషత్ పీఠాన్ని టీడీపీ దౌర్జన్యంతో లాక్కుంది. ఇక్కడ మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉంటే వైఎస్సార్సీపీ 12 (ఒకరు మృతి), టీడీపీ 9 స్థానాలు దక్కించుకున్నాయి. వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా టీడీపీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. ప్యాపిలి- 3 ఎంపీటీసీ పెద్దిరాజు, జక్కసానిగుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి భర్తను రహస్య ప్రాంతానికి తరలించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పెద్దిరాజు హాజరుకాలేదు. జక్కసానిగుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి భర్తను టీడీపీ నాయకులు వారి వద్ద ఉంచుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలి చేత టీడీపీకి ఓటేయించుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికకు ప్యాపిలి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన డోన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డిని సైతం టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్దఎత్తున మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆగడాలకు దిగారు. పోలీసులు వారించినా లెక్కపెట్టలేదు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు, అధికారుల వత్తాసుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యులు ఎన్నికను బహిష్కరించారు. డోన్ మండలంలోనూ టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసి ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రెండు పార్టీలు సమానంగా ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్నాయి. టాస్ వేస్తే వైఎస్సార్సీపీకి వస్తుందనే భయంతో ఉడుములపాడు ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మిని ఎన్నికకు రాకుండా చేసి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ నాయకులు కైవసం చేసుకున్నారు. హాజరుకాకుండా అడ్డుకొని.. ఆలూరు, వెల్తుర్తి మండలాల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ ఎన్నికకు హాజరుకాకుండా చేశారు. ఇక్కడ పోటాపోటీ ఉండటంతో టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. టీడీపీకి ఎవరూ పోటీలేకుండా చేసుకుని ఆలూరు, వెల్దుర్తి ఎంపీపీ పీఠాలను దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదోని మండలంలో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. టీడీపీ నేతలు పది రోజుల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు రంగమ్మ, ఆమె భర్తను బలవంతంగా తమ క్యాంపునకు తీసుకెళ్లారు. శుక్రవారం ఎన్నికకు రంగమ్మ హాజరుకావటంతో ఆమె అవ్వ బయటకు తీసుకొచ్చారు. తాను తప్పుచేశానని గ్రహించుకున్న రంగమ్మ వైఎస్సార్సీపీ ర్యాలీలో పాల్గొనటంతో టీడీపీ నేతలు అడ్డుకొని అవమానించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మనస్తాపానికి చెందిన రంగమ్మ కంటతడి పెట్టింది. ఆదోని మండలంలో టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎంపీపీకి పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేయాలని చూశారు. అయితే ఎవరూ లొంగకపోవడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కోవెలకుంట్ల మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బనగానపల్లె ఎమ్మెల్యే అనుచరులు ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకున్నారు. అయితే ఎంపీపీగా ఎన్నికైన క్రిష్ణమ్మ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందటం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే క్రిష్ణమ్మ ఆ పార్టీలో చేరారని ఆమె బంధువులు చెప్పారు. సి. బెళగల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుకావడంతో అక్కడ ఎంపీపీ పదవిని టీడీపీ దక్కించుకుంది. గడివేముల మండల పరిషత్‌కు టీడీపీ అభ్యర్థులు ఇద్దరు పోటీ పడ్డారు. ఇక్కడ వైఎస్సార్సీపీ పీఠాన్ని దక్కించుకుంది. బండిఆత్మకూరు, వెలుగోడు మండల పరిషత్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాస్ ద్వారా కైవసం చేసుకొంది. కోడుమూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను రకరకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు కోట్ల వంశీధర్‌రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. -
మండలాధీశుల ఎన్నిక నేడే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మండల పరిషత్ అధ్యక్ష పదవులను అత్యధికంగా తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ ము మ్మరంగా ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని మొత్తం 36 మండలాల్లో ఇప్పటికే 19 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎంపీపీలు, ఉపాధ్యక్షులు ఎన్నికయ్యేందుకు స్పష్టమైన మెజార్టీ ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కాంగ్రెస్, టీడీపీలకు చెం దిన ఎంపీటీసీ సభ్యులు, స్వతంత్రులు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో మరో నాలుగు స్థానాలు టీఆర్ఎస్ కు పెరిగే అవకాశం ఉంది. ఇందూరు జిల్లాపై దృష్టి సా రించిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ నగర పాలక సం స్థ, ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీలతో పాటు జడ్పీ, మెజార్టీ మండల పరిషత్‌లను కైవసం చే సుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పీఠాలను కైవసం చేసుకునేం దుకు మంత్రికి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఎంపీ లు, ఎమ్మెల్యేలు సైతం సర్వశక్తులొడ్డాలని సూచించిన ట్లు సమాచారం. కాగా మరో రెండు రోజుల్లో మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనుండగా క్యాంపు రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ప్రతిష్టాత్మకం మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు పరీక్షగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం రెండు ఎంపీ, 9 అసెంబ్లీ స్థా నాల్లో గెలిచిన టీఆర్ఎస్ మున్సిపల్, పరిషత్ ఎన్నిక ల్లో సత్తా చాటాలని చూస్తోంది. పరిషత్, మున్సిపల్ ఎ న్నికల్లో టీడీపీ పూర్తిగా దెబ్బతినగా... దిగ్గజాలైన నేతలున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఓ వైపు క్యాంపు రాజకీయాలు నడుపు తూ.. మరో వైపు ఆపరేషన్ ‘ఆకర్ష్’తో గాలం వేస్తూ సర్వశక్తులొడ్డుతున్నారు. మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు 24 కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మూడోసారి ఇం దూరు జడ్పీపై గులాబీ జెండా ఎగుర వేయనుండగా.. మెజార్టీ ఎంపీపీ స్థానాలపై దృష్టి సారించింది. ఎంపీటీ సీ ఎన్నికల్లో 583 స్థానాలకుగాను టీఆర్ఎస్ 240 ద క్కించుకోగా.. కాంగ్రెస్‌కు 225, బీజేపీకి 34, టీడీపీకి 31, ఎంఐఎంకు 2 స్థానాలు దక్కగా, 49 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. అ యితే ఫలితాల అనంతరం అనేక మంది పార్టీలు మా ర్చారు. ఆ మార్పు టీఆర్ఎస్కే అనుకూలంగా మారిం దంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తమ ఎం పీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి చేరుకుం టుందోని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ‘హంగ్’ స్థానాలపై వ్యూహం ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ‘హంగ్’ స్థానాలపై టీ ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించా యి.స్వతంత్రులను తమవైపు తిప్పుకుని పీఠాలు సాధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నందిపేటలో 20 ఎంపీటీసీ స్థానాలకుగాను కాం గ్రెస్ 8, టీఆర్ఎస్ 6 గెలవగా, ఇక్కడ స్వతంత్రులు కీలకంగా మారారు. రెంజల్ మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలుం డగా ఇందులో 5 కాంగ్రెస్ పార్టీ, 4 బీజేపీ, 2 టీఆర్ఎస్ ఎంపీటీసీలు గెలిచారు. ఇక్కడ హంగ్ ఏర్పడింది. మోర్తాడ్‌లో పదహారు ఎంపీటీసీ సభ్యులకు గాను కాం గ్రెస్ శిబిరంలో ఎనిమిది మంది, టీఆర్ఎస్ శిబిరంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. రెండు పక్షాల్లో సమానంగా ఎంపీటీసీ సభ్యులు ఉండటంతో టాస్ ద్వారా ఎన్నిక జరుగుతుందా? లేక జంప్‌జిలానీలతో ఫలితా లు తారుమారవుతాయా? అన్న ఉత్కంఠ నెలకొంది. భీమ్‌గల్ మండలంలోను 18 ఎంపీటీసీ స్థానాలకు గా ను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సరిసమానంగా ఎం పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇక్కడి ఎన్నికపై కూడ ఉత్కంఠ నెలకొంది. మాచారెడ్డి మండలంలో 17 ఎం పీటీసీలు ఉండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి ఎని మిది మంది చొప్పున గెలవగా.. ఇండిపెండెంట్లపైన్నే ఎంపీపీ స్థానం ఆధారపడి ఉంది. ధర్పల్లి మండలంలోని 14 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, టీఆర్ఎస్ 5, టీడీపీ 1, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకోగా, ‘హంగ్’ పరిస్థితి నెల కొంది. ఇలా చాలాచోట్ల ‘హంగ్’ పరిస్థితి నెలకొనగా.. ఆ స్థానాల్లో ఎంపీపీ స్థానాలు కీలకంగా మారాయి. -
నేడే మండలాధీశుల ఎన్నిక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : స్థానిక సంస్థల్లో కీలకమైన మండల పరిషత్‌లకు ఎట్టకేలకు సారథుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో కారు జోరు కొనసాగింది. 52 మండలాల పరిధిలో 292 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అత్యధిక మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు టీఆర్ఎస్కు దక్కనున్నాయి. సుమారు 30కి పైగా ఎంపీపీ స్థానాలను దక్కించుకోనుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని.. హంగ్ ఫలితాలొచ్చిన 25 మండలాల్లో ఎక్కువ ఎంపీపీ స్థానాలను తమ ఖాతా లో వేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదిపింది. 165 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ సుమారు ఐదు మండలాల ఎంపీపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. మూడు మం డల పరిషత్‌లు టీడీపీకి దక్కనుండగా, ఒకటీ, రెండు మండలాల్లో ఎంపీపీ స్థానాలను గెలుచుకుని ఉనికి చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మొదట కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక.. ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ రోజు ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవరించిన వారికే ఇప్పుడు ఎంపీపీ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఆ ఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం ముందుగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం ఉద యం 10 గంటల వరకు కో-ఆప్షన్ సభ్యుని స్థానానికి నామినేషన్లు స్వీకరిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ పరిశీలన కో ఆప్షన్ సభ్యుని స్థానానికి పోటీలో ఉన్న వారి పేర్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. మొద ట ఎంపీటీసీలందరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నుకుంటున్నారు. ఎంపీపీ పదవి కోసం ఓ సభ్యుని పేరును ఓ ఎంపీటీసీ ప్రతిపాదిస్తే.. మరో సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీని, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు. ఎంపీటీసీల్లో 50 శాతం మంది ఉంటే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు.