తాడిచెర్ల బ్లాక్‌ ప్రైవేటుకు.. | ingarani handed over excavation works to AMR company | Sakshi
Sakshi News home page

తాడిచెర్ల బ్లాక్‌ ప్రైవేటుకు..

Published Sat, Aug 5 2017 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

ingarani handed over excavation works to AMR company

- ఏఎంఆర్‌ కంపెనీకి తవ్వకం పనులు అప్పగించిన సింగరేణి
25 ఏళ్లపాటు ఓబీ, బొగ్గు తవ్వకాలకు ఒప్పందం
 
కోల్‌బెల్ట్‌(భూపాలపల్లి): సింగరేణిలో నూతన అంకానికి తెరలేచింది. సంస్థ ఆవిర్భావం నుంచి భూగర్భ గనులు.. ఓసీల్లో సొంతంగా బొగ్గు వెలికితీయడంతో పాటు విదేశాల్లోనూ బొగ్గు వెలికితీతకు ప్రయత్నిస్తున్న సింగరేణి పురిటిగడ్డపై బొగ్గు వెలికితీత పనులను ప్రైవేటుకు అప్పగించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్‌–1 పరిధిలో ఓసీ తవ్వకం పనులను ఏఎంఆర్‌ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ 25 ఏళ్లపాటు ఓవర్‌ బర్డెన్‌(ఓబీ–పైన మట్టి తవ్వడం), బొగ్గు వెలికితీత పనులు చేయనుంది. ఈ మేరకు తాడిచెర్ల సమీపంలోని కాపురం గ్రామ పరిసరాల్లో 15 రోజులుగా పనులు కొనసాగిస్తోంది.

తాడిచర్ల బ్లాక్‌–1 పరిధిలో పనులను ఏఎంఆర్‌ కంపెనీకి అప్పగిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకోగా.. నెల క్రితం ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ కంపెనీలు దక్కించుకున్నా.. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఏఎంఆర్‌ సంస్థ సిద్ధమవుతుండగా తొలిదశ పనులు చేపట్టింది. తాడిచెర్ల బ్లాక్‌–1 పనులు చేపట్టే సామర్థ్యం కలిగిన సింగరేణి సంస్థను విస్మరించి ప్రైవేట్‌ రంగం వైపు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపడంపై విమర్శలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement