పాదచారులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ముగ్గురు మృతి | Innova Hits Pedestrians In Rajapur Mahabubnagar | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ముగ్గురు మృతి

Published Sun, Jul 21 2019 5:53 PM | Last Updated on Sun, Jul 21 2019 6:21 PM

Innova Hits Pedestrians In Rajapur Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని రాజాపూర్‌ మండలం కుచ్చెర్కల్‌ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పాదచారులపైకి ఇన్నోవా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మగ్గురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రంగయ్య, యాదగిరి, చంద్రయ్యలుగా గుర్తించారు. అయితే ఇన్నోవా వాహనంలో ఉన్నవారు మాత్రం ప్రమాదం జరిగిన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించిన పలువురు యువకులు రంగారెడ్డిగూడ వద్ద దానిని అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని రాజాపూర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement