స్ఫూర్తి నింపిన మహిళ
పంజగుట్ట, న్యూస్‌లైన్: మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ. అవయవ దానంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ముంబయిలో నివాసముండే ఆలం, అనిత (32) తమ ఆరేళ్ల కుమారుడితో సహా ఓ పని నిమిత్తం మహబూబ్‌నగర్ వెళ్లారు. ఈ నెల 22న ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ కింద పడ్డారు.
ఈ ఘటనలో అనితకు తీవ్రగా గాయాలయ్యాయి. ఆలం, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనితను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు నగరంలోని కేర్ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతు న్న ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు ఈ నెల 29న వైద్యులు నిర్థారించారు.
జీవన్‌దాన్ ప్రతినిధుల సలహాతో ఆలం... అనిత అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ఆమె రెండు కిడ్నీలు, కాలేయం, గుండె నా ళాలను సేకరించినట్టు నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ తెలిపారు.