కరీంనగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలే పై చేరుు సాధించారు. బుధవారం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 42,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 21,680 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 18,893 మంది పరీక్షలకు హాజరుకాగా 7,887 మంది ఉత్తీర్ణత సాధించారు.
బాలికలు 23,299 మంది పరీక్షలు రాయగా 13,793 మంది ఉత్తీర్ణత పొంది బాలుర కంటే పై చేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 41.75 శాతం కాగా, బాలికలు 59.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. మన జిల్లా మొత్తం 51 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణలో 6వ స్థానంలో నిలిచింది. అరుుతే గతేడాది కంటే మూడు శాతం ఉత్తీర్ణత మెరుగవడం విశేషం.
సారంగాపూర్ ఫస్ట్.. చొప్పదండి లాస్ట్
జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం 6,866 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 64 మంది పాసై జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారు. రెండవ స్థానాన్ని అదే మండలంలోని బీర్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కైవసం చేసుకుంది. ఇక్కడ 98 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 92 మంది ఉత్తీర్ణులయ్యారు. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 113 మంది విద్యార్థులకు 90 మంది ఉత్తీర్ణులు కాగా, ఫలితాల్లో మూడో స్థానం పొందింది. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 157 మంది విద్యార్థులకు కేవలం 29 మందే ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈ కళాశాల జిల్లాలోనే చివరి స్థానం ఆక్రమించింది. అరుుతే గతేడాది కంటే మూడు శాతం పెరగడం పట్ల ఆర్‌ఐవో సుహాసిని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
వొకేషనల్‌లో 39 శాతం
జిల్లాలోని వృత్తివిద్యా కళాశాలల్లో 39 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. వృత్తివిద్యా కోర్సుల్లో బాలురు 3428 మంది పరీక్షలకు హాజరుకాగా 1037 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1629 మందికి 937 మంది పాసయ్యూరు. జిల్లాలో 5,057 మంది పరీక్షలకు హాజరుకాగా 1974 మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు.
పరీక్ష ఫీజు గడువు మే ఒకటి
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విధ్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే ఒకటి వరకు గడువు విధించారు. మే 25 నుంచి జూన్ ఒకటి వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
బాలికలదే హవా
Published Thu, Apr 23 2015 1:55 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement
Advertisement