సూర్యాపేట : కొంత కాలంగా గరుడ బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూటికేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ వై.మొగలయ్య శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు.
బస్సుల్లోని ప్రయాణికులే టార్గెట్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండీ.ఇర్ఫాన్, మక్సూద్ అహ్మద్, అహ్మద్ హసన్, ఎం డీ.జమీర్, బాయ్ హైదరాబాద్ కేంద్రం గా ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. వీరు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు, హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గరుడ బస్సుల్లో ప్రయాణికుల సూటికేసులు, బ్యాగుల్లో ఉన్న నగదు, బంగారం అపహరిస్తున్నారు. వరంగల్ , దంతాలపల్లిలో గంజా యి కొనుగోలు చేస్తూ వారి స్వస్థలాల్లో ఎ క్కువ డబ్బుకు విక్రయించుకుంటున్నారు.
పట్టుబడ్డారు ఇలా..
ఉదయం 10.30గంటలకు సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండీ.ఇర్ఫాన్, మక్సూ ద్ అహ్మద్, అహ్మద్ హసన్‌లు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి బ్యాగులో కిలో చొప్పున మూడు కిలోల గంజాయి, ఈ నెల 22న హైటెక్ బస్టాండ్‌లో గరుడ బస్సులో అపహరించిన 13గ్రాముల పగడాలహారం లభించింది. విచారించగా నేరాలను ఒప్పుకున్నారు. ముఠాలోని ఎండీ.జమీర్, బాయ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. సమావేశంలో ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేశి కరుణాకర్, జి.కిషోర్, సంగి నరేందర్, ఎల్లారెడ్డి, దైద రాజు పాల్గొన్నారు.
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Published Sun, Mar 1 2015 2:50 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement