మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు!
Published Sat, Nov 8 2014 2:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
షెడ్యూల్ సిద్ధం చేసిన అధికారులు.. త్వరలోనే అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలను 2015, మార్చి 11 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ కార్యదర్శికి పంపించినట్లు తెలిసింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలను వేరుగానే నిర్వహించుకోవాలన్న నిర్ణయం మేరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేపరు కొనుగోలు, సరఫరాకు సంబంధించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మార్చి 11 నుంచే పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. 2014లో మార్చి 12 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా, 2015లో మాత్రం మార్చి 11న పరీక్షలు ప్రారంభించి అదేనెల 31లోగా పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ పరీక్షల తేదీలపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
Advertisement
Advertisement