నల్లగొండ అర్బన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రగ తి జూనియర్ కాలేజీ విద్యార్థులు బైపీసీ విభాగంలో జిల్లా ప్రథమ, రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకులతో సంచలనం సృష్టిం చారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను బి.సిరి, కె.సోని 433 మార్కుల చొప్పున సాధించి జిల్లా ప్రథమ స్థానం సాధించారు. అదే విధంగా సీహెచ్.హేమాంజలి, వి.శ్రావణి, బి.సౌమ్యలు 432 మార్కులు పొందారు. ఎంపీసీ విభాగంలో 470 మా ర్కులకు గాను ఎస్.స్వాతి, వి.అజయ్‌లు 464 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకును పొందారు. కె.లోకేష్‌రెడ్డి 463 మార్కులు, సీహెచ్. ఐశ్వర్య, నేహా అఫ్రోజ్, ఎస్.శ్రీవాణి, కె.రష్మీ, జి.సాయితేజస్విలు 462 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ చందా కృష్ణమూర్తి, డెరైక్టర్లు ఎ.నరేందర్‌బాబు, ఎన్.శశిధర్‌రావు, చందా శ్రీనివా స్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు.
‘ఆల్ఫా’ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఆల్ఫా జూనియర్ కాలేజీ విద్యార్థులు పలువురు జిల్లా, రాష్ట్రస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ బాదిని రవికుమార్ తెలిపారు. బైపీసీ విభాగంలో జే.సాయిశ్రీ 431, ఎంపీసీలో ఎన్. నరేష్ 454, ఎం.రజిత 450, సీఈసీలో హాజ్రాకుల్‌సుం 474, ఎంఈసీలో జి.శశాంక్‌రెడ్డి 465, హెచ్‌ఈసీలో ఆర్.ఉపేందర్ 450, ఎంఎల్‌టీలో సీహెచ్. తరుణ్‌కుమార్ 436 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం లో పి.రవి, ఎస్.శ్రీనివాస్, ఎల్లయ్య, శంకరయ్య, లింగస్వా మి, బిక్షం, వెంకన్న, శేఖర్, నరేష్, దుర్గారావు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు
Published Thu, Apr 23 2015 12:28 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement