Intermediate first year results
-
AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్
సాక్షి, అమరావతి: ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,13,033 మంది విద్యార్థులు హాజరుకాగా 5,38,327 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 3,79,758 మంది పరీక్షలు రాయగా 72 శాతం (2,72,001) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 4,33,275 మంది పరీక్షలకు హాజరవగా 61 శాతం (2,66,3266) మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. 2022లో ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఈ ఏడాది ఫస్టియర్‌లో ఏడు శాతం, సెకండియర్‌లో 11 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ నెల 1 నుంచి 18 వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం చేపట్టి కేవలం 8 రోజుల రికార్డు సమయంలోనే œలితాలను ప్రకటించడం విశేషం. కాగా, ఫలితాల కోసం https://examresults. ap.nic.in, www.bie.ap.gov.in చూడొచ్చు. ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా టాప్ ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి (ఫస్టియర్) రెండో స్థానం, గుంటూరు (ఫస్టియర్) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో గుంటూరు రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానం దక్కించుకున్నాయి. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఇంటర్ ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 37 శాతం, సెకండియర్‌లో 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ పరీక్షలకు 36,031 మంది హాజరుకాగా 17,507 మంది (49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 31,293 మంది హాజరవగా 19,430 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 72 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, కర్నూలు 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. విద్యకు అధిక ప్రాధాన్యం: మంత్రి బొత్స ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను సైతం రికార్డు స్థాయిలో వెల్లడించడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అందుకే విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. విద్యపై పెట్టిన ప్రతి పైసా పెట్టుబడితో సమానమని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ విద్య కార్యదర్శి ఎం.వి శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, సర్వశిక్ష ఎస్‌బీడీ శ్రీనివాస్, ఎండీఎం డైరక్టర్ నిధి మీనన్, పాఠ్యపుస్తకాల ముద్రణా సంస్థ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
AP Inter Results 2023: ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేస్కోండి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు. ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్ ►ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి ►ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి: మంత్రి బొత్స ►సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి ►ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి ►మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి ►విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తాం ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి విజయవాడకు చేరుకోవడం ఆలస్యమైంది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల ఆలస్యమయింది. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు examresults.ap.nic.in, www.bie.ap.gov.in, మనబడి సైట్‌ల్లో కూడా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.. -
గురుకుల కళాశాలల్లో మెరుగైన ఫలితాలు
ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలోని గురుకుల కళాశాలలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. గతేడాది 56.89 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2014-15 విద్యా సంవత్సరంలో 87.42 శాతం సాధించాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ బాలికల కళాశాలలు, ఆదిలాబాద్, నార్నూర్, లాల్టెక్డి బాలుర కళాశాలలు కలిపి మొత్తం ఆరు కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 779 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కాగా.. 681 మంది ఉత్తీర్ణత సాధించారు. 98 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇచ్చోడ బాలికల కళాశాల అత్యధికంగా 99.13 శాతం సాధించి మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నార్నూర్ బాలుర కళాశాల 96.48 శాతం సాధించింది. ఆదిలాబాద్ బాలుర కళాశాల 68 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది. -
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు
నల్లగొండ అర్బన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రగ తి జూనియర్ కాలేజీ విద్యార్థులు బైపీసీ విభాగంలో జిల్లా ప్రథమ, రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకులతో సంచలనం సృష్టిం చారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను బి.సిరి, కె.సోని 433 మార్కుల చొప్పున సాధించి జిల్లా ప్రథమ స్థానం సాధించారు. అదే విధంగా సీహెచ్.హేమాంజలి, వి.శ్రావణి, బి.సౌమ్యలు 432 మార్కులు పొందారు. ఎంపీసీ విభాగంలో 470 మా ర్కులకు గాను ఎస్.స్వాతి, వి.అజయ్‌లు 464 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకును పొందారు. కె.లోకేష్‌రెడ్డి 463 మార్కులు, సీహెచ్. ఐశ్వర్య, నేహా అఫ్రోజ్, ఎస్.శ్రీవాణి, కె.రష్మీ, జి.సాయితేజస్విలు 462 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ చందా కృష్ణమూర్తి, డెరైక్టర్లు ఎ.నరేందర్‌బాబు, ఎన్.శశిధర్రావు, చందా శ్రీనివా స్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు. ‘ఆల్ఫా’ విద్యార్థుల ప్రతిభ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఆల్ఫా జూనియర్ కాలేజీ విద్యార్థులు పలువురు జిల్లా, రాష్ట్రస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ బాదిని రవికుమార్ తెలిపారు. బైపీసీ విభాగంలో జే.సాయిశ్రీ 431, ఎంపీసీలో ఎన్. నరేష్ 454, ఎం.రజిత 450, సీఈసీలో హాజ్రాకుల్సుం 474, ఎంఈసీలో జి.శశాంక్‌రెడ్డి 465, హెచ్ఈసీలో ఆర్.ఉపేందర్ 450, ఎంఎల్‌టీలో సీహెచ్. తరుణ్‌కుమార్ 436 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం లో పి.రవి, ఎస్.శ్రీనివాస్, ఎల్లయ్య, శంకరయ్య, లింగస్వా మి, బిక్షం, వెంకన్న, శేఖర్, నరేష్, దుర్గారావు పాల్గొన్నారు. -
మనమే లాస్ట్
ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు విడుదల రాష్ట్రంలో జిల్లాదే చివరి స్థానం జనరల్‌లో 38 శాతం.. ఒకేషనల్‌లో 33 శాతం ఉత్తీర్ణత గతేడాది కంటే 8.5 శాతం తగ్గుదల మే 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. గతేడాది 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 23వ స్థానానికి దిగజారింది. గతేడాది 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం 38 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఫలితాలు మెరుగ్గా రాకపోయినా కష్టపడి చదివిన విద్యార్థులు పాసైతే తమకు సంతోషమని అప్పట్లోనే పేర్కొన్న విషయం తెలిసిందే. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంతో ఫలితాల శాతం తగ్గినట్లు కనబడుతోంది. ఈ ఏడాది కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం జనరల్ కోర్సుల్లో 24,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 9,232 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 11,874 మంది పరీక్షకు హాజరు కాగా, 3,658 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 31 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 12,619 మంది పరీక్షకు హాజరు కాగా, 5,574 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో 3,349 మంది పరీక్షకు హాజరు కాగా, 1,110 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు 2,214 మంది పరీక్షకు హాజరు కాగా, 670 మంది ఉత్తీర్ణులయ్యారు. 30 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1,135 మంది పరీక్షకు హాజరుకాగా, 440 మంది పాసయ్యారు. 39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ ఏడాది 8.5 శాతం తగ్గింది. ఫలితాలను గ్రేడ్ల రూపంలో, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతంపైగా మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘ఏ’, 60 నుంచి 75 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘బీ’, 50 నుంచి 60 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘సీ’, 35 నుంచి 50 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్‘డీ’ కేటాయించారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆర్ఐవో ఫజలుల్లా తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మే 6లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. రీ కౌంటింగ్ కోసం రూ. 100, జిరాక్స్‌కాపీ కోసం రూ. 600 డీడీ తీయాల్సి ఉందన్నారు. టాపర్లు వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎంపీసీలో దీక్ష జూనియర్ కళాశాల నిర్మల్‌కు చెందిన డి.విఘ్నేశ్వర్ 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలకు చెందిన శ్వేతకు 461, బైపీసీలో మంచిర్యాలలోని అల్పోర్స్ జూనియర్ కళాశాలలో ఫరాసమ్రీన్కు 440 మార్కులకు 433 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలోని క్రిసెంట్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి ముషారఫ్ అజ్జుమంద్ 440 మార్కులకు 431 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో మంచిర్యాలలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన సునీషా 500 మార్కులకుగాను, 484 మార్కులు సాధించారు. ఎనిమిదేళ్ల ఫలితాలు.. సంవత్సరం ఫలితాల శాతం 200607 44.89 200708 49.78 200809 45.61 200910 45.00 201011 49.00 201112 47.00 201213 46.50 201314 38.00