ఆసిఫాబాద్‌అర్బన్: ‘బ్యూటీ పార్లర్స్’ ఏర్పాటు చేసుకోవడానికి అర్హత గల గిరిజన మహిళలు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం కింద జిల్లాలో మొత్తం 10 బ్యూటీ పార్లర్స్ మంజూరైనట్లు తెలిపారు. 10వ తరగతి పాస్, లేదా ఫెయిల్, 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు, వార్షిక ఆదాయం ఏజెన్సీలో రూ.1.50లక్షలు మైదాన ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదన్నారు.
బ్యూటీషియన్, ఆరోగ్య పరిరక్షణలో శిక్షితులైన అభ్యర్థులై ఉండాలని తెలిపారు. ఇందుకుగాను ఒక్కొక్క యూనిట్ అంచనా రూ.2 లక్షలు కాగా ఇందులో 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగతా నిధులు జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించన్నుట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ 31లోపు పూర్తి చేసి అర్హత గల గిరిజన మహిళలకు అర్థిక సహాయంతోపాటు, స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల గిరిజన మహిళలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Mar 24 2018 11:15 AM | Last Updated on Sat, Mar 24 2018 11:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment