ఖమ్మం గాంధీచౌక్: ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ సెంటర్‌లో ఇన్‌కంట్యాక్స్ దాడులు జరగటంతో వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక వర్గాల్లో వణుకు పుడుతోంది. మంగళవారం ఉదయం 11:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గాంధీచౌక్ సెంటర్‌లోని ప్రముఖ వ్యాపారి వేములపల్లి నగేష్ ఇంట్లో ఇన్‌కంట్యాక్స్ అధికారులు సోదాలు జరిపారు. దాదాపు 10మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ఈ దాడులకు జిల్లా ఇన్‌కంట్యాక్స్ అధికారులు, సిబ్బంది కూడా సహకరించారు. జిల్లాలోని ప్రముఖ వ్యాపారుల్లో వేములపల్లి నగేష్ ఒకరని కూడా వ్యాపార వర్గా ల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిత్యం ఆర్థిక లావాదేవీలు నెరుపుతూ ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యం బ్యాంకుల ద్వారా జరిపే ఆర్థికలావాదేవీలకు సంబంధించి పాన్ కార్డును కడా వినియోగిస్తారు. అయితే పాన్ కార్డు ఆధారంగా ఆర్థిక లావాదేవీల వ్యవహారం తెలుస్తుంది. అందుకనుగుణంగా ఐ.టి రిటన్స్ చేశా రా..? లేదా..? అందుకే నగేష్ ఇంటిపై ఏకబిగిన దాడులు జరిగాయా..? లేక ఎవరైనా ఆయన ఆస్తులపై ఇన్‌కంటాక్స్ అధికారులకు ఉప్పందించ్చారా..? అనేది చర్చ జరుగుతుంది.
నగేష్ ఆస్తులకు సంబందించిన పత్రాలను, వివిధ డాక్యుమెం ట్‌లను, వ్యాపారాలకు సంబంధించిన పత్రాలు, బ్యాంకుల పాస్ బుక్‌లు, ఇతరత్రా డాక్యుమెంట్‌లు ఐ.టి శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు బంగారం, నగదు తదితర ఆస్తిపాస్తులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. వీటిలో ఇన్‌కంటాక్స్ చెల్లించని ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది ఆ శాఖ ప్రకటించాల్సి ఉంది. నగేష్ ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో ఆయన బంధువర్గాలు కలవర పడ్డట్లు సమాచారం. 10 గంటలకు పైగా ఐ.టి అధికారులు ఒకే ఇంటిలో సోదాలు నిర్వహించటంతో జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పరిశ్రమ వర్గాల వారు ఆందోళనలో ఉన్నారు.
ఇటీవల కాలంలో ఐ.టి దాడులు జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో గత కొంత కాలంగా మునుపెన్నడూ లేని విధంగా ఐ.టి దాడులు జరగుతున్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, వ్యాపార వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇన్‌కంట్యాక్స్ చెల్లించని ఆస్తులపై జరిమానాలు విధించి పెద్ద మొత్తంలో(లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు సమాచారం. జిల్లాలో వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల ద్వారా టర్నోవర్ వాటికి సంబంధించి సక్రమంగా రిటర్న్స్ వస్తున్నాయా..? లేదా..? అనే అంశాలను కూడా ఐ.టి విభాగం అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వ ఆదాయం పెంచే లక్ష్యంగా కూడా ఈ దాడులు జరగుతున్నాయనే చర్చ కూడా వ్యాపార వర్గాల్లో జరుగుతుంది.
ఐ.టి రిటర్‌న్సకు పరుగులు
ఖమ్మం నగరంలో ఐ.టి దాడులు జరిగిననేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఆదాయ పన్ను చెల్లించేందుకు పరుగులు తీస్తున్నారు. తమకున్న ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నులను చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను విభాగం వారు దాడులు చేసి జరిమానాలు విధించి కేసుల పాలు చేస్తే ఇబ్బందులు పడుతామనే ఆలోచనతో తమకున్న ఆస్తులకు సంబంధించి పన్నులు చెల్లించి క్లీన్‌గా ఉండాలని కొందరు భావిస్తున్నారు.
ఐటీ దాడులతో వ్యాపార వర్గాల్లో వణుకు
Published Thu, Mar 5 2015 3:00 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement
Advertisement