అలా అనుకుంటే కేసీఆర్ పొరపాటే: జీవన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపముందని, పార్టీని బలోపేతంచేసే సమర్ధ నాయకత్వం అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ హైకమాండ్‌కు సన్నిహితులైన ఎమ్మెల్సీలే టీఆర్‌ఎస్‌లో చేరడం బాధాకరమని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నేతను చూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపముందని, పార్టీని బలోపేతంచేసే సమర్ధ నాయకత్వం అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ బలపడుతుందంటే... అది కేసీఆర్ పొరపాటే జీవన్‌రెడ్డి అన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించడంక కంటే ఎన్నికల హామీలపై చిత్తశుద్ధి చూపాలని కేసీఆర్ కు జీవన్ రెడ్డి సూచించారు. రుణమాఫీ అమలు ఆలస్యమవుతున్నందున తక్షణమే ఖరీఫ్ రుణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలని జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.