‘సమాచార’ కమిషనర్లను నియమించండి | Jana Chaitanya Vedika Demand For Appointed RTI commissioners  | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 2:54 AM | Last Updated on Thu, Jul 5 2018 2:54 AM

Jana Chaitanya Vedika Demand For Appointed RTI commissioners  - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న పద్మనాభయ్య చిత్రంలో వి. లక్ష్మణరెడ్డి, పి. విజయబాబు 

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సమాచార కమి షనర్లను, కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్‌ను నియమించా లని జన చైతన్య వేదిక డిమాండ్‌ చేసింది. అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లోకయుక్త, మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ను నియమించాలని కోరిం ది. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేస్తున్నాయని, వివిధ పార్టీల పాలనలో ఉన్న కేరళ, ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో సమా చార కమిషన్‌ ఏమాత్రం పనిచేయడం లేదని అన్నారు.

మాజీ సమాచార కమిషనర్‌ పి.విజయబాబు ప్రసంగిస్తూ తిరుమల దేవాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలన్నారు.  ఏపీలో సమాచార కమిషన్‌ దాదాపు పనిచేయడం లేదని చెప్పారు. ఏపీలో ముఖ్య కమిషనర్‌తో పాటు కమిషనర్ల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని, దాదాపు 10 వేల ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు వివిధ రాష్ట్రాల సమా చార కమిషనర్ల వద్ద 9 లక్షలకు పైగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని అప్పా డైరెక్టర్‌ ఎస్‌. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అవినీతిలో ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని, క్షేత్ర స్థాయిలో అవినీతి లేనిదే పనులు కాని పరిస్థితి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతోందని వాపోయారు.       

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement