'టీడీపీ కార్యాలయంపై దాడి అనైతికం, అప్రజాస్వామికం' | Janareddy takes on TRS workers | Sakshi
Sakshi News home page

'టీడీపీ కార్యాలయంపై దాడి అనైతికం, అప్రజాస్వామికం'

Published Tue, Oct 21 2014 9:19 PM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM

'టీడీపీ కార్యాలయంపై దాడి అనైతికం, అప్రజాస్వామికం' - Sakshi

'టీడీపీ కార్యాలయంపై దాడి అనైతికం, అప్రజాస్వామికం'

హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తలపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టడాన్ని మంగళవారం ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం, అప్రజాస్వామిక మన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జానారెడ్డి డిమాండ్ చేశారు.

కాగా, నల్లగొండ జిల్లాలోని టీడీపీ కార్యాలయంపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడికి దిగి పర్నిచర్, వాల్ పోస్టర్లకు నిప్పుంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కార్యాలయం పర్నిచర్, కిటికి అద్దాలు ధ్వంసమైయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement