TRS workers
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం.. కార్యకర్తల సంబరాలు
-
డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు
నందినగర్: నాలుగు రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
ఎమ్మెల్యే చిన్నారెడ్డికి గాయాలు
-
కార్యకర్తలకు పదవుల హారం
సాక్షి, హైదరాబాద్: ‘ఈసారన్నా నన్ను విముక్తి చేస్తారేమో అనుకుంటే.. ప్రభుత్వం వచ్చినంక విడిచిపెడుతమన్నరు. మళ్లీ ఈసారి కూడా నన్నే పెట్టిండ్రు. మంచిది, సంతోషం. అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలే. అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. అనేక త్యాగాలు, నిర్బంధాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలతో తెలంగాణ సాకారమైంది. ఈ ఘనత అంతా టీఆర్ఎస్ కార్యకర్తలదే. ఇది చరిత్రలో సుస్థిరం. కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులు అంతా మీరే’ అని కేసీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలో సుదీర్ఘ ప్రసంగంలో ముందుగా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ అమరుల త్యాగాలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘సాంస్కృతిక సారథి వేదికపై రసమయి బాలకిషన్ ఏడ్చిండు. కళ్ల నీళ్లు పెట్టుకున్నాం. 14 ఏళ్ల జ్ఞాపకాలు రీలుగా గిర్రున తిరిగాయి. గులాబీ కండువాలు వేసుకొని వెళితే ఎన్నో అపహాస్యాలు... ఎక్కడా మడమ తిప్పలే. నేను చిన్నబోతే ‘నాయిని’ వచ్చి మేమున్నామని ఉత్సాహ పరిచేవాడు. మనం జెండా కింద పెడితే జన్మలో తెలంగాణ రాదని నా వెంట ఉన్న అక్కాచెల్లెళ్లు వెన్నుతట్టారు. శ్రీకాంతాచారి, స్వర్ణ, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్, యాదగిరిరెడ్డి వంటి ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటాం.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే రెండుమూడు నెలల్లో మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతామని, అందరికీ పదవులు వస్తాయని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ‘మీరు చేసిన సభ్యత్వం చూసి గర్వ పడుతున్నా. ఊహించని విధంగా 50 లక్షల మంది పార్టీలో చేరారు. రూ.10 కోట్ల సభ్యత్వ రుసుం వచ్చింది. రూ. 4.50 కోట్లు కార్యకర్తల పేరిట బీమా ప్రీమియం చెల్లించినం. ఎవరికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా రూ.2 లక్షల ఆర్థికసాయం అందుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. -
'టీడీపీ కార్యాలయంపై దాడి అనైతికం, అప్రజాస్వామికం'
హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తలపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టడాన్ని మంగళవారం ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం, అప్రజాస్వామిక మన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, నల్లగొండ జిల్లాలోని టీడీపీ కార్యాలయంపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడికి దిగి పర్నిచర్, వాల్ పోస్టర్లకు నిప్పుంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కార్యాలయం పర్నిచర్, కిటికి అద్దాలు ధ్వంసమైయ్యాయి. -
అశ్వాపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం
ఖమ్మం: తెలంగాణ బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా అశ్వాపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం సృష్టించారు. నేడు గురు పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లివస్తున్న భక్తుల కార్లపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ అయినా వాహనాలు ఎలా నడుపుతారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. -
మంథనిలో రాజకీయ దాడులు
మంథని, న్యూస్‌లైన్: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణలకు దిగడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంథనిలోని శ్రీపాద కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డుసభ్యుడు ఆకుల శ్రీనివాస్‌పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడి విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. కాలనీకి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ టీఆర్ఎస్ వారు ఎదురుతిరిగారు. ఈక్రమంలో రెండు వర్గాలు ఘర్షణపడ్డాయి. దీంతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది కారంపొడి, మారణాయుధాలతో ఇక్కడికి వచ్చారని, తమ కార్యకర్తపై దాడి చేశారని టీఆర్ఎస్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకోవడంతో.. తమపై దాడి చేసేందుకు వచ్చిన వారికి రక్షణ ఎలా కల్పిస్తారని మంథని సర్పంచ్ పుట్ట శైలజ, జెడ్పీటీసీ సరోజనతోపాటు కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు సదరు కార్యకర్తలను వదిలేశారు. వాహనం నుంచి వారు దిగి పరుగెత్తడంతో మరోసారి రెండు వర్గాలు దాడికి దిగాయి. ఇలా సుమారు గంటకు పైగా పరస్పరం దాడులు జరుగడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రాజకీయ కక్షల కారణంగా రెండు రోజులుగా పరస్పర దాడులు జరుగుతుండటంతో మంథనిలో భయానక వాతావరణం నెలకొంది. -
‘శంఖారావం’ బస్సులపై దాడి
సాక్షి నెట్వర్క్: సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి శంఖారావం సభకు వెళ్లే బస్సులను ఖమ్మం, వరంగల్ మీదుగా దారి మళ్లించారు. దాంతో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర్లోని కడిపికొండ వద్ద హైదరాబాద్ వెళ్తున్న బస్సులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కొన్ని బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడగా, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యూయి. అనంతరం పోలీసులు బస్సులను ఎస్కార్ట్ సహాయంతో హైదరాబాద్ పంపించారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట - స్టేషన్ ఘన్‌పూర్‌ల మధ్య తెలంగాణవాదు లు సమైక్య సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు బస్సులను కదలనివ్వలేదు. అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో బస్సులను వెనక్కు మళ్లించి తిరిగి వరంగల్ మీదుగా హైదరాబాద్ పంపించారు. జనగామ- సూర్యాపేట రోడ్డులో దేవరుప్పల, సింగరాజుపల్లి వద్ద కూడా ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. దేవరుప్పల వద్ద పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పోలీసులను వారించారు. ఆ తరువాత పోలీసులు పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేసి సీమాంధ్ర వాహనాలను సురక్షితంగా హైదరాబాద్‌కు పంపించారు. విద్యార్థుల ఆందోళన సమైక్య శంఖారావం సభకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు, నిజాం హాస్టల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మరికొందరు విద్యార్థులు హాస్టల్ పైనుంచి స్టేడియంలోకి రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఎల్బీ స్టేడియంలోకి దూసుకెళ్లిన పలువురు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.