మెట్రోరైలు భవన్‌లో జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కాలుష్య నిర్మూలనలో అద్భుత ఫలితాలు సాధించిన జపాన్ దేశ అనుభవా లను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెట్రో రైలు భవన్‌లో మంగళవారం జపాన్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో వాయు నాణ్యతను పెంచేందుకు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని వారిని కోరారు. చెత్త ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టూ ఎనర్జీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులు, స్పాట్ ఇన్సినరేషన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలపై జపాన్ సహకారం తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లో తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందన్నారు.
ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు కాలుష్య పరిశ్రమలు
అతి కాలుష్య కారక పరిశ్రమలను నగరం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు తరలిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమల్లో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్ధతులను అనుసరిస్తామన్నా రు. త్వరలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీ వంటి ప్రాజె క్టులో అంతర్భాగంగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కాలుష్య నియంత్రణ పద్ధతు లను పాటించనున్నామని వివరించారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇప్పటికే వాయు కాలుష్య, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నియంత్రణ పద్ధతుల అధ్యయనానికి జపా న్‌లో పర్యటన చేసిందని, తమ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇక్కడి పరిస్ధితులను అధ్య యనం చేసేందుకు జపాన్ బృందం ఇక్కడ మూడురోజుల పాటు పర్యటిస్తోందన్నారు.
జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో ప్రతినిధులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారని మంత్రి తెలిపారు. వీరు బీబీనగర్ పవర్ ప్లాంటు, జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సందర్శిస్తా రన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పర్యటించి, ఇక్కడి పరిస్థితులకు అనుగు ణంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై ఒక నివేదిక ఇస్తారని కేటీఆర్ తెలిపారు. తమ దేశంలో పాటిస్తున్న కాలుష్య నియంత్రణ పద్ధతులను జపాన్ ప్రతినిధి బృందం ఈ సమావేశంలో వివరించింది. ముఖ్యంగా టోక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ ఆధ్యర్యంలో చేపట్టిన కార్యక్రమా లను తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయ నున్న క్లీన్ ఎయిర్ అథారిటీకి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంది.
Comments
Please login to add a commentAdd a comment