దొంగసర్టిఫికెట్లపై జేసీ ఆరా | JC inquires on Thief Certificates | Sakshi
Sakshi News home page

దొంగసర్టిఫికెట్లపై జేసీ ఆరా

Published Tue, Oct 13 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

మండల పరిధి గోమారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ‘దొంగ సర్టిఫికెట్లతో దోచేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది.

శివ్వంపేట: మండల పరిధి గోమారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ‘దొంగ సర్టిఫికెట్లతో దోచేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. ఆదివారం ప్రచురితమైన ఈ కథనంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి ఆరా తీశారు. నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంక్ రుణాలు పొందిన వారి వివరాలను సేకరించి, అందుకు బాధ్యులైన వారి వివరాలు తెలపాలని రెవెన్యూ సిబ్బందికి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఉదంతంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహశీల్దార్ రాజయ్య చెప్పారు.

Advertisement

పోల్

Advertisement