
సీఆర్‌టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. స్థానిక ఎన్జీ కాలేజీ ఆవరణలో సోమవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఆర్‌టీలు పాల్గొని సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మారుమూల మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో గత ఆగస్టు నుంచి పనిచేస్తున్న సీఆర్‌టీలకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు *5500, ఎస్‌జీటీలకు *4500 వేతనాన్ని మూడు నాలుగు నెలలకో మారు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఆశ్రమ పాఠశాలల సీఆర్‌టీలు పాల్గొన్నారు