జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ రాక? | Jodeghat arrival CM KCR? | Sakshi
Sakshi News home page

జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ రాక?

Published Mon, Sep 29 2014 3:49 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ రాక? - Sakshi

జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ రాక?

కెరమెరి: కొమురం భీమ్ పోరుగడ్డలో సకల సౌకర్యాలు కల్పిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంత్రి కెరమెరి మండలం హట్టిబేస్ క్యాంపులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జోడేఘాట్ పరిస్థితిని చూసిరమ్మని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. గతంలో జోడేఘాట్‌ను సందర్శించి నప్పుడు పర్యాటక కేం ద్రంగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చుతానన్నారు. రోడ్డు, రవాణా సౌకర్యాలతోపాటు విద్యుత్, తాగునీరు అంది స్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రథమ గిరిజన పండుగ కనుక ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించగా ఇంత తొందరలో త్రీఫేజ్ ఇవ్వడం కుదరదని సింగల్ ఫేజ్ 24 గంటలు ఇస్తామన్నారు. త్రీ ఫేజ్ విద్యుత్ కో సం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మహనీయుని జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాన్ని ఏ ర్పాటు చేస్తామన్నారు. బాబేఝరి నుంచి జోడేఘాట్ వరకు, వావుదాం నుంచి జోడే ఘాట్ వర కు శాశ్వత రోడ్డుకు అటవీ అనుమతులు కూడా ఇప్పిస్తామన్నారు.

అనంతరం జోడేఘాట్‌ను సందర్శించారు. హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. భోజనం, తాగునీరు, వాహనాలు ఆగుస్థ లం, స్టాల్స్ ఏర్పాటు స్థలాలను పరిశీలించారు. మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ట్లు చెప్పారు. సుమారు 10 వేల మంది వస్తారు కనుక ఏర్పాట్లు బాగా ఉండాలన్నారు. హెలీ ప్యాడ్ కోసం నాలుగైదు చోట్ల స్థలాన్ని పరిశీలించారు. అక్కడి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా 8న సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నా రు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబ స్తు చేశారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు.

మునుపెన్నడు జరగని విధంగా 8న కొమురం భీమ్ 74వ వర్ధంతిని జరుపుతామని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ప్రభుత్వం ఈ పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు, ప్రజలు సహకరించాలన్నారు. కొమురం భీమ్‌కు  ఎంతో ప్రాముఖ్యత ఉందని దీన్ని మరింత చాటే విధంగా ఈ కార్యక్రమం జరగాలన్నారు. తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలెతై చిన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లాలకు 24 గంటలు నీరు సరఫరా ఉండాలన్నారు.
 
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం..
 - ఎస్పీ గజరావు భూపాల్

ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొమురం భీమ్ వర్ధంతిని ఎక్కడ నిర్వహించాలో చెబుతామని ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. ఇటీవల ఇద్దరు మావోలు లొంగిపోయారని గుర్తు చేశా రు. ఈ కార్యక్రమానికి బధ్రత చాలా ముఖ్యమని చెప్పారు. పరిస్థితులను పై అధికారులతో తెలిపి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి జరపాలి
- గిరిజన నాయకుల డిమాండ్

శాంతి భద్రతల సాకుతో రెండు చోట్ల భీమ్ వర్ధంతి జరపకూడదని జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి జరపాలని గిరిజన సంఘాల నాయకు లు సిడాం అర్జు, ఆత్రం లక్ష్మన్, అనక దేవ్‌రా వు, ఆత్రం చందన్‌శావ్ డిమాండ్ చేశారు. 8న జిల్లా నుంచి అభిమానులు ఇక్కడ తరలిరావాలని, సుదూరం నుంచి వచ్చే వారికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మావోలు ఉన్నారని భయపడి హట్టిలో చేసుకుంటే వారి ఉనికి   పెరుగుతుందని వారన్నారు. భీమ్ గ్రామంలోనే కార్యక్రమం చేస్తే భీమ్ ఆత్మకు శాంతి అని అన్నారు.

గతంలో జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని, రూ.100 కోట్లు నిధులు ముంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, బెల్లంపల్లి డీఎస్పీ సురేశ్, ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్, ఎస్సై అంబేద్కర్, ఆర్డీవో రామచంద్ర య్య, ఆర్టీవో శ్యాం నాయక్, ట్రాన్క్ ఏడీ విలా స్, డీఈ సుభాశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మతీన్, టీసీ ప్రకాశ్, ఈజీఎస్ ఏపీడీ గణేశ్, తహశీల్దార్ దత్తు, ఎంపీడీవో సాజిత్‌అలీ, ఏటీడబ్ల్యూవో అంబాజి, ఎంఈవో మల్లయ్య పాల్గొన్నారు.
 
 సీఎం కేసీఆర్ రాక?
- అక్టోబర్ 8న కొమురం భీమ్ వర్ధంతి
- కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైనట్లు సమాచారం. అక్టోబర్ 8న జరగనున్న గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 74వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జోడేఘాట్‌ను సందర్శించారు. వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ హెలిప్యాడ్ నిర్మాణ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ గిరిజన పండగలకు సీఎం వచ్చే అవకాశాలున్నాయని ఐటీడీఏ అధికార యంత్రాంగం పేర్కొంటుండగా, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టు కదళిక నేపథ్యంలో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జోడేఘాట్‌లో కాకుండా, కెరమెరి మండల కేంద్ర సమీపంలోని హట్టీలో నిర్వహించాలని పోలీసులు పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని జోడేఘాట్‌లోనే నిర్వహించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement