Komuram Bhim
-
మగపులిని మట్టుబెట్టారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మగపులిది అసహజ మరణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ దరిగాం–సర్కెపల్లి మధ్య బూడిదమామిడి అడవుల్లో ఈ నెల 6న ఏడాదిన్నర ఆడపులి, ఈ నెల 8న ఐదేరాళ్ల మగపులి (ఎస్9) కళేబరాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆడపులి మరోపులితో పోరులో చనిపోగా, మగపులి విషంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నియమించిన టీంతో కలిసి పీసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియల్, చీఫ్ వైల్డ్‌లైఫ్ ఇన్చార్జి ఎంసీ పర్గేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ ఎఫ్డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, పశువైద్యాధికారులు, ఎన్జీఓ, ఇతర సిబ్బందితో వివరాలు తీసుకున్నారు. అనంతరం ఎన్టీసీఏ నిబంధనల మేరకు అడవిలోనే పులి, పశుకళేబరాలను దహనం చేశారు. పులిపై విష ప్రయోగం ఒక పులి అంతర్గత పోరులో, మరో పులి విషం పెట్టడంతో చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. మగపులి మెడకు ఉచ్చు కూడా ఉంది. అది వదులుగా ఉంది. పులి ఉచ్చు పడితే తనంతట తాను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కనిపిస్తున్న ఆధారాలను బట్టి పులి వేటాడిన పశుకళేబరంలో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చు. దానిని తిన్న పులి చనిపోయి ఉండొచ్చనిపిస్తోంది. నమూనాలు మూడు ల్యాబ్‌లకు పంపుతున్నాం. నివేదిక వస్తే స్పష్టత వస్తుంది. ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణలో స్థానిక పోలీసు సాయంతో నేరస్తులను పట్టుకుంటాం. – ఆర్ఎం డొబ్రియల్ పులులెలా చనిపోతున్నాయి? సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ కారిడార్‌లో వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మొదట రెండు పులుల ఆవాస ఆధిపత్య పోరులో ఒకటి చనిపోయిందని తేల్చారు. మరో పులి అదే తీరుగా పొట్లాటలో మృతి చెందిందని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకేచోట రెండు మరణించడం, పశువుల కళేబరాలు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలైంది. ‘తడోబా–అందేరి’, ‘తిప్పేశ్వర్’కు పెన్‌గంగా, ప్రాణహిత పక్కనే ఉన్న కాగజ్‌నగర్ పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. దరిగాం సమీపప్రాంతాల్లోనే ఎస్9 మగపులి, ఎస్6 అనే ఆడపులితో జతకట్టడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. వాటి వయసు రెండేళ్లు దాటడంతో ఆవాసం వెతుక్కుంటున్నాయి. మరోవైపు ఎస్6 కోసం మరో మగపులి రావడం, అక్కడే ఎస్9 కూడా ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇలా తల్లి, నాలుగు పిల్లలు, మగపులులతో అక్కడే సంచరిస్తున్నాయి. అడవిలో వన్యప్రాణుల లభ్యత లేక స్థానిక గిరిజన రైతుల పశువులే వాటికి ఆహారంగా మారాయి. రెండేళ్లుగా ఆరు పశువులను చంపగా, కొందరికే పరిహారం రాగా, మరికొందరికి అందలేదు. పశువులపై దాడులతో ప్రతీకారమా... పశువులను చంపేస్తున్న పులులను హతమార్చాలని ఎవరైనా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ మొదలైంది. గతంలో పులులకు ఉచ్చులు బిగిసి ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం చెన్నూరు డివిజన్లో అమర్చిన ఉచ్చుకు కే4 ఆడపులి చిక్కి నడుము భాగంలో ఉండిపోయింది. ఇప్పటికీ ఆ పులి జాడ లేదు. అదే డివిజన్ శివ్వారం, ఉట్నూరు డివిజన్‌లోనూ ఉచ్చులతో పులులకు ముప్పు జరిగాయి. ఎస్6, ఆ పిల్లలు సురక్షితమేనా? ఎస్6తోపాటు మరో మూడు పిల్లలు క్షేమంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. పులుల మరణానికి ముందు చివరగా దరిగాం పరిధిలోనే ఓ పశువును హతమార్చి భుజిస్తుండగా కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత వాటి జాడ లేదు. ఆవాసాల ఆధిప్యత పోరు, కొత్త పులి రాకతో ఘర్షణతో వేరే చోటుకు వెళ్లాయా? లేక విషం, ఉచ్చుల బారిన పడ్డాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ఆచూకీకి 50 మంది యానిమల్ ట్రాకర్స్ వెతుకుతున్నారని, ఈ చుట్టుపక్కల యాభైదాకా కెమెరా ట్రాక్‌లను అమర్చి పర్యవేక్షిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆస్కార్ కు అడుగు దూరంలో ఎన్టీఆర్
-
‘కుమురం’ మ్యూజియానికి భూమి ఏదీ?
సాక్షి, వరంగల్: స్వాతంత్య్ర సమరయోధుడు కుమురం భీమ్, రాంజీ గోండు స్మారక మ్యూజి యంల కోసం కేంద్రం రూ.30కోట్లు మంజూరు చేసి రెండేళ్లైనా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భూములు కేటాయించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. డీపీఆర్ సిద్ధం చేసేందుకు రూ.కోటిచ్చినా ఇప్పటికీ అడుగుముందుకు పడలేదని మండి పడ్డారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామ రాజు మ్యూజియం పనులు కూడా ప్రారంభమ య్యాయని తెలిపారు. వరంగల్‌లోని వేయి స్తంభా ల గుడి, భద్రకాళి దేవాలయాల్లో కిషన్ రెడ్డి మంగళ వారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్లిన ఘంటసాల జయంతి శతాబ్ది ఉత్సవాలను ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుందన్నారు. జూలై 4న అల్లూరి సీతా రామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందు కు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని తెలిపారు. గవర్నర్‌పై కక్షసాధింపు..: కేంద్ర ప్రభుత్వ ఆస్పి రేషన్ డిస్ట్రిక్ట్స్ కింద ఎంపికైన భూపాలపల్లి జిల్లాలో వైద్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల కల్ప నకు నీతి ఆయోగ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నా మన్నారు. కౌశిక్‌రెడ్డిని నామి నేటెడ్ ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనను ఒప్పు కోకపోవడంవల్లే గవర్నర్‌పై కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ... వెంటనే వరి ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
Adivasi Girl: కెమెరామెన్‌గా రాణిస్తున్న ఆదివాసీ యువతి
సాక్షి, కుమురం భీం: ఫోటోగ్రఫీ అంటే మగవాళ్ల సామ్రాజ్యం!ఎక్కువగా పురుషులే ఈ రంగంలో ఉంటారు. అయితే మగవాళ్లకు తానేం తక్కువ కానంటుంది ఓ ఆదివాసి యువతి. ఫోటోగ్రఫీలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అద్బుతమైన ఫోటోలు తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. కుమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆత్రం మాధవరావు ముగ్గురు కుమార్తెల్లో చివరి అమ్మాయి మమత. ఆమె సిర్పూర్ యూ మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. అయితే ఆమె చదువకుంటునే ఫోటోగ్రఫర్, వీడియో గ్రాఫర్‌గా రాణిస్తోంది. రోడ్లు కూడా సరిగాలేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీస్తోంది మమత. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఇతర శుభకార్యలకు కూడా ఆమె ఫోటోలు తీస్తోంది. తనకు చదువుకుంటూ ఫోటోలు తీయటం సంతోషంగా ఉందని పేర్కొంది. -
రెండు పాములను పట్టుకొని షోచేశారు.. కాసేపటికి..
కుమ్రంభీంజిల్లా(ఆదిలాబాద్): పాములను పట్టుకోవడంలో రాజులమని భావించారు. పట్టుకున్న పాములతో చాలాసేపు ఆడుకున్నారు.. ఈ క్రమంలో అదే పాముకాటు వేయటంతో ఒక యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిపాలయ్యాడు. ఈ విషాద ఘటన కుమ్రంభీం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం పక్కన రెండు పాములు కన్పించాయి. ఈ క్రమంలో స్థానికులు, సోనుపటేల్ గూడకు చెందిన కనక రాంజీ, కనక రాందాస్‌లకు సమాచారం అందించారు. దీంతో, అన్నదమ్ములిద్దరు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న జంట పాములను చేతితో ఓడిసి పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. తాము పాములను పట్టుకున్నామని రోడ్డుపై వెళ్తున్న జనాలకు చూపెట్టారు. కాసేపు వాటితో ఆడుకున్నారు. ఒక పాము బుసలు కొడుతూ.. తీవ్రమైన కోపంతో కనక రాంజీ అనే యువకుడి ఏడమ చేయి బోటన వేలుపై కాటు వేసింది. దీంతో వారిద్దరు భయపడిపోయారు. అప్పటి వరకు ఉన్న వారి వినోదం కాస్త.. విషాదంగా మారిపోయింది. రాంజీని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
రెండు పాములను పట్టుకొని షోచేశారు.. కాసేపటికి..
-
16న కొమురం భీం 76వ వర్ధంతి
తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీం 76వ వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గిరిజన ఐక్య వేదిక ప్రెసిడెంట్ వివేక్ వినాయక్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్ర హం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎ.చందూలాల్, డాక్టర్ కేవీ రమణాచారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల ఆటాపాట ఉంటాయని తెలిపారు. -
కొమురం భీంను నిజాం చంపలేదు
ప్రజలు చనిపోయింది.. పోలీస్ యాక్షన్ వల్లే: నాయిని సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పాలకులు చేపట్టిన పోలీస్ యాక్షన్ వల్లనే తెలంగాణ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టులు, ప్రజలు చనిపోయారు తప్ప నిజాం నవాబు వల్ల కాదని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నిజాం 99 శాతం మంచి పనులు చేశారని, రజాకార్ల వల్ల కొంత చెడు జరిగిందన్నారు. నిజాం ప్రజల మనిషి కాబట్టే కేసీఆర్ ఆయనను పొగిడారని, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి వంటి వాళ్లకు చరిత్ర తెలియదని ధ్వజమెత్తారు. స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శనివారం తెలంగాణ భవన్లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. కొమురం భీం, చాకలి ఐలమ్మ వంటి వారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలొడ్డితే ఆయనను పొగడడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా ‘కొమురంభీంను నిజాం చంపలేదు. ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఎవ్వరూ చెప్పలేదు’ అని సమాధానమిచ్చారు. నిజాం కాలంలోనే నిజాం సాగర్ కట్టారని, రైల్వేస్టేషన్లు, హాస్పిటళ్లు, చారిత్రక కట్టడాలన్నీ ఆయన కట్టించినవేనన్నారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పల్లెలకు పల్లెలు టీఆర్ఎస్లో చేరుతున్నాయన్నాయన్నారు. -
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలి
సీఎంకు కొమరం భీమ్ మనవడి విజ్ఞప్తి వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలని, ఉట్నూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, గిరిజనుల విద్య, వైద్య, వ్యవసాయం, రవాణ సదుపాయూలపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్‌కు కొమురం భీమ్ మనవడు కొమురం సోనేరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎంకు సోనేరావు, బంధువు ఆత్రం భుజంగరావు, కొమురం భీమ్ స్మారకసమితి అధ్యక్షుడు రుద్రశంకర్, ఆత్రం తిరుపతి, కనక వెంకటేశ్వరరావు, తొడసం పుల్లారావువినతిపత్రాన్ని సమర్పించారు. ఈనెల 8న జరగనున్న కొమురంభీమ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని వుుఖ్యవుంత్రిని ఆహ్వానించారు. కొమురం సోనేరావు కొడుకు, కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆత్రం భుజంగరావు, రుద్రశంకర్ చెప్పారు. కుంటాల జలపాతం హైడల్ ప్రాజెక్టును రద్దుచేయాలని కోరారు. కొమురంభీమ్ పేరు కలకాలం నిలిచేలా చూస్తాం: సీఎం కొమురం భీమ్ పేరు కలకాలం నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ నెల 8న కొమురం భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయున అధికారులను ఆదేశించారు. కొమురం భీమ్ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామన్న సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కొమురం భీమ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళ్లేందుకు గతంలో మంత్రులు జంకేవారన్నారు. గిరిజన ఉత్సవంగా కొమురం భీమ్ వర్ధంతి ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ‘‘కొమురం భీమ్ ఫెస్టివల్’’గా గిరిజన ఉత్సవ నిర్వహణకు రూ.10 లక్షలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. -
జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ రాక?
కెరమెరి: కొమురం భీమ్ పోరుగడ్డలో సకల సౌకర్యాలు కల్పిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంత్రి కెరమెరి మండలం హట్టిబేస్ క్యాంపులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జోడేఘాట్ పరిస్థితిని చూసిరమ్మని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. గతంలో జోడేఘాట్‌ను సందర్శించి నప్పుడు పర్యాటక కేం ద్రంగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చుతానన్నారు. రోడ్డు, రవాణా సౌకర్యాలతోపాటు విద్యుత్, తాగునీరు అంది స్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రథమ గిరిజన పండుగ కనుక ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించగా ఇంత తొందరలో త్రీఫేజ్ ఇవ్వడం కుదరదని సింగల్ ఫేజ్ 24 గంటలు ఇస్తామన్నారు. త్రీ ఫేజ్ విద్యుత్ కో సం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మహనీయుని జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాన్ని ఏ ర్పాటు చేస్తామన్నారు. బాబేఝరి నుంచి జోడేఘాట్ వరకు, వావుదాం నుంచి జోడే ఘాట్ వర కు శాశ్వత రోడ్డుకు అటవీ అనుమతులు కూడా ఇప్పిస్తామన్నారు. అనంతరం జోడేఘాట్‌ను సందర్శించారు. హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. భోజనం, తాగునీరు, వాహనాలు ఆగుస్థ లం, స్టాల్స్ ఏర్పాటు స్థలాలను పరిశీలించారు. మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ట్లు చెప్పారు. సుమారు 10 వేల మంది వస్తారు కనుక ఏర్పాట్లు బాగా ఉండాలన్నారు. హెలీ ప్యాడ్ కోసం నాలుగైదు చోట్ల స్థలాన్ని పరిశీలించారు. అక్కడి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా 8న సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నా రు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబ స్తు చేశారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. మునుపెన్నడు జరగని విధంగా 8న కొమురం భీమ్ 74వ వర్ధంతిని జరుపుతామని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ప్రభుత్వం ఈ పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు, ప్రజలు సహకరించాలన్నారు. కొమురం భీమ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉందని దీన్ని మరింత చాటే విధంగా ఈ కార్యక్రమం జరగాలన్నారు. తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలెతై చిన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లాలకు 24 గంటలు నీరు సరఫరా ఉండాలన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.. - ఎస్పీ గజరావు భూపాల్ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొమురం భీమ్ వర్ధంతిని ఎక్కడ నిర్వహించాలో చెబుతామని ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. ఇటీవల ఇద్దరు మావోలు లొంగిపోయారని గుర్తు చేశా రు. ఈ కార్యక్రమానికి బధ్రత చాలా ముఖ్యమని చెప్పారు. పరిస్థితులను పై అధికారులతో తెలిపి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి జరపాలి - గిరిజన నాయకుల డిమాండ్ శాంతి భద్రతల సాకుతో రెండు చోట్ల భీమ్ వర్ధంతి జరపకూడదని జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి జరపాలని గిరిజన సంఘాల నాయకు లు సిడాం అర్జు, ఆత్రం లక్ష్మన్, అనక దేవ్రా వు, ఆత్రం చందన్‌శావ్ డిమాండ్ చేశారు. 8న జిల్లా నుంచి అభిమానులు ఇక్కడ తరలిరావాలని, సుదూరం నుంచి వచ్చే వారికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మావోలు ఉన్నారని భయపడి హట్టిలో చేసుకుంటే వారి ఉనికి పెరుగుతుందని వారన్నారు. భీమ్ గ్రామంలోనే కార్యక్రమం చేస్తే భీమ్ ఆత్మకు శాంతి అని అన్నారు. గతంలో జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని, రూ.100 కోట్లు నిధులు ముంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, బెల్లంపల్లి డీఎస్పీ సురేశ్, ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్, ఎస్సై అంబేద్కర్, ఆర్డీవో రామచంద్ర య్య, ఆర్టీవో శ్యాం నాయక్, ట్రాన్క్ ఏడీ విలా స్, డీఈ సుభాశ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మతీన్, టీసీ ప్రకాశ్, ఈజీఎస్ ఏపీడీ గణేశ్, తహశీల్దార్ దత్తు, ఎంపీడీవో సాజిత్అలీ, ఏటీడబ్ల్యూవో అంబాజి, ఎంఈవో మల్లయ్య పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాక? - అక్టోబర్ 8న కొమురం భీమ్ వర్ధంతి - కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైనట్లు సమాచారం. అక్టోబర్ 8న జరగనున్న గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 74వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జోడేఘాట్‌ను సందర్శించారు. వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ హెలిప్యాడ్ నిర్మాణ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ గిరిజన పండగలకు సీఎం వచ్చే అవకాశాలున్నాయని ఐటీడీఏ అధికార యంత్రాంగం పేర్కొంటుండగా, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టు కదళిక నేపథ్యంలో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జోడేఘాట్‌లో కాకుండా, కెరమెరి మండల కేంద్ర సమీపంలోని హట్టీలో నిర్వహించాలని పోలీసులు పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని జోడేఘాట్‌లోనే నిర్వహించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలి’
హైదరాబాద్: ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టాలని ఆచార్య జయధీర్ తిరుమలరావు, అరుణోదయ విమలక్క డిమాండ్ చేశారు. అక్టోబరు 7, 8 తేదీలలో జోడే ఘాట్‌లో కొమురం భీం 74వ వ ర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ కొమురం భీం వర్ధంతి కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వీరు ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా దోమలగూడలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొమురం భీం చిత్రాన్ని పార్లమెంటులో పెట్టాలని, ఉట్నూరులో ఆదివాసీ వర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. జోడే ఘాట్‌లోనే కొమురం భీం వర్ధంతిని నిర్వహించాలని కోరారు. రూ. 200 కోట్లతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని, ఆయన పేరిట ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొము రం భీం మనవడు కొమురం సోనేరావు, వర్ధంతి కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.