సీఎంకు కొమరం భీమ్ మనవడి విజ్ఞప్తి
వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానం
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలని, ఉట్నూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, గిరిజనుల విద్య, వైద్య, వ్యవసాయం, రవాణ సదుపాయూలపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్‌కు కొమురం భీమ్ మనవడు కొమురం సోనేరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎంకు సోనేరావు, బంధువు ఆత్రం భుజంగరావు, కొమురం భీమ్ స్మారకసమితి అధ్యక్షుడు రుద్రశంకర్, ఆత్రం తిరుపతి, కనక వెంకటేశ్వరరావు, తొడసం పుల్లారావువినతిపత్రాన్ని సమర్పించారు. ఈనెల 8న జరగనున్న కొమురంభీమ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని వుుఖ్యవుంత్రిని ఆహ్వానించారు. కొమురం సోనేరావు కొడుకు, కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆత్రం భుజంగరావు, రుద్రశంకర్ చెప్పారు. కుంటాల జలపాతం హైడల్ ప్రాజెక్టును రద్దుచేయాలని కోరారు.
కొమురంభీమ్ పేరు కలకాలం నిలిచేలా చూస్తాం: సీఎం
కొమురం భీమ్ పేరు కలకాలం నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ నెల 8న కొమురం భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయున అధికారులను ఆదేశించారు. కొమురం భీమ్ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామన్న సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కొమురం భీమ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళ్లేందుకు గతంలో మంత్రులు జంకేవారన్నారు.
గిరిజన ఉత్సవంగా కొమురం భీమ్ వర్ధంతి
ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ‘‘కొమురం భీమ్ ఫెస్టివల్’’గా గిరిజన ఉత్సవ నిర్వహణకు రూ.10 లక్షలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది.
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలి
Published Thu, Oct 2 2014 12:52 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement