సంగారెడ్డి : జిల్లాలో కల్తీ కల్లు మరణాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మొదక్ జాయింట్ కలెక్టర్ పి.వెంకటరాం రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం కల్తీ కల్లు మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎక్సైజ్ శాఖ కల్తీ కల్లును నిషేధించకపోవడంతోనే ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని, ఈ సమయంలో శాఖలన్ని సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు.