డిసెంబరు 5 నిరసనలో జర్నలిస్టులు పాల్గొనాలి: ఐజేయూ | Journalists to be participated in protest on December 5 | Sakshi
Sakshi News home page

డిసెంబరు 5 నిరసనలో జర్నలిస్టులు పాల్గొనాలి: ఐజేయూ

Published Sat, Oct 18 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

Journalists to be participated in protest on December 5

సాక్షి, హైదరాబాద్: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 5న తలపెట్టిన నిరసనలో జర్నలిస్టులందరూ పాల్గొనాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), పలు జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయి. యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు మారిస్తే.. కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలని ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 డిసెంబరు 5న జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఏపీ న్యూస్‌పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరహత్ అలీ వేర్వేరు ప్రకటనల్లో పిలుపిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement