
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచార కేసులను విచారించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. 11 ప్రత్యేక కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు ఈ నెల 28 లోగా బాధ్యతలను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోర్టు–న్యాయమూర్తుల వివరాలు..
హైదరాబాద్–బి.శ్రీనివాసరావు, ఎల్‌బీనగర్ –కె.మారుతిదేవి, ఆదిలాబాద్–వై.జయప్రసాద్, వరంగల్–పి.ముక్తి దా, మహబూబ్‌నగర్–పి.ఆనీరోజ్, నల్లగొండ –వి.శారదాదేవి,ఖమ్మం–కె.అరుణకుమారి, కూకట్‌పల్లి(రంగారెడ్డిజిల్లా) –జె.మైత్రేయి,కరీంనగర్–డి.మాధవికృష్ణ, సంగారెడ్డి (మెదక్ జిల్లా)–ఎం.శ్యాం శ్రీ, నిజామాబాద్–టి.నర్సి రెడ్డి.