కలెక్టరేటా.. చెత్తకుండీనా..? | k.ilambarithi Took charge as collector | Sakshi
Sakshi News home page

కలెక్టరేటా.. చెత్తకుండీనా..?

Published Sat, Aug 2 2014 2:12 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM

k.ilambarithi Took charge as collector

* సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..?
* మయపాలన పాటించాలిపరిష్కృతి ఫిర్యాదులు
* రిపీట్ కావొద్దు అధికారులకు అక్షింతలు వేసిన కొత్త కలెక్టర్
* బాధ్యతల స్వీకరణ రోజునే ఇలంబరితి మార్కు

 
ఖమ్మం జెడ్పీసెంటర్: ఇది జిల్లా పరిపాలన కార్యాలయమా..! చెత్త కుండీనా..! .ఏమిటి ఈ చెత్త..! ఈ వాహనాల పార్కింగ్ ఏంటి .. ? సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..? ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పరిష్కృతి ఫిర్యాదుల నమోదు ఉందా...! హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రస్థాయి అధికారులు ఈ విభాగంపై దృష్టి సారిస్తారు....ఈ విషయం తెలుసా.. ? అని ప్రశ్నల వర్షం కురిపించారు జిల్లా కలెక్టర్ ఇలంబరితి. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన  డాక్టర్ కె.ఇలంబరితి  తొలిరోజే అధికారులకు అక్షింతలు వేశారు.
 
శుక్రవారం ఉదయం 5.36గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరిగి బయటకు వెళ్తూ డీఆర్వో శివశ్రీనివాస్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. జిల్లా అధికారులు సమయ పాలన పాటించాలని ...కలెక్టరేట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ..తీరు మార్చుకోవాలని అగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటిస్తే అన్ని పనులు సత్వరం జరుగుతాయని హితబోధ చేశారు. ముందు మీరు సమయ పాలన పాటించాలని డీఆర్వోకు చెప్పారు.
 
జిల్లాలో  పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను తాను హైదరాబాద్ వెళ్లే వరకు తెలపాలన్నారు. పరిష్కృతిలో ఫిర్యాదుల నమోదు సక్రమంగా జరగాలన్నారు. రెండు రోజుల్లో ఫిర్యాదుదారులకు సమాధానం తెలియాలన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను హైదరాబాద్ స్థాయిలో పరిశీలిస్తారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కలెక్టరేట్ ఆదర్శవంతంగా నిలవాలని చెప్పారు. వాహనాల పార్కింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు.
 
కలెక్టర్ వస్తారని తెలిసినా....
జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించాల్సిన డీఆర్వోనే జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం చర్చనీయాంశమయింది. కలెక్టర్ కార్యాలయానికి వీఐపీలు వచ్చినప్పుడు తన సిబ్బందితో కలిసి కలెక్టరేట్ పోర్టికో వరకు వెళ్లి వీఐపీలకు పుష్పగుచ్ఛం అందజేసి వారిని గౌరవప్రదంగా కలెక్టరేట్‌లోకి తీసుకొస్తారు డీఆర్వో.
 
కాగా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఇలంబరితికి అలాంటి ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తానని కలెక్టర్ ప్రకటించినా  జిల్లా రెవెన్యూ అధికారి  సమయానికి కలెక్టరేట్‌కు రాలేదు. కలెక్టర్ చాంబర్‌లోకి వచ్చిన 30 నిమిషాలకు డీఆర్వో రావడం, కనీసం స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement