నీకు బుద్ధి లేదు.. నీకే లేదు..! | Kadiyam, ERRABELLI altercation | Sakshi
Sakshi News home page

నీకు బుద్ధి లేదు.. నీకే లేదు..!

Published Tue, Sep 30 2014 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

నీకు బుద్ధి లేదు.. నీకే లేదు..! - Sakshi

నీకు బుద్ధి లేదు.. నీకే లేదు..!

కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం
వరంగల్ జెడ్పీ సమావేశం రసాభాస

 
హన్మకొండ : వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రాజకీయ నాయకుల పరస్పర దూషణకు వేదికగా మారింది. రాజకీయ ఎత్తుగడలకు ఈ సమావేశాన్ని పావుగా వాడుకున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు సభా మర్యాదలు మరిచి ఒకరినొకరు ‘నీకు సిగ్గులేదు.. నీకు బుద్ధిలేదు’ అంటూ దూషించుకున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో యూరియా కొరతపై ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి ద యాకర్‌రావు, రెడ్యానాయక్ అధికారులను నిల దీశారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలను సరిగా చెప్పలేకపోతున్నారం టూ అధికారులపై ఎంపీ కడియం శ్రీహరి మం డిపడ్డారు. అయితే, ఎంపీ చర్చను పక్కదారి పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆక్షేపించారు.  దీనిపై కడియం శ్రీహరి మాట్లాడు తూ సీనియర్ ఎమ్మెల్యే ఇలా మాట్లాడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్ష సభ్యులను దబాయిస్తున్నావేంటి అం టూ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ‘నీకు బుద్ధిలేదు, నీకు సభ్యత లేదు’ అంటూ ఎర్రబెల్లి, కడియం పరస్పరం దూషిం చుకున్నారు. తొమ్మిదేళ్లు మంత్రిగా ఉండి నువ్వు ఏం...(రాయలేని పదాన్ని వినియోగించారు) అంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రతిగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరతానని ఎందుకు మా వెంట తిరుగుతున్నావ్ అంటూ కడియం హెచ్చు స్వరంతో ధ్వజమెత్తా రు. ఇద్దరి వాదన శృతి మించడంతో జిల్లాపరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ జి.కిషన్, జెడ్పీటీసీ సభ్యులు వారిని సముదాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement