Srihari Kadiyam
-
‘స్టేషన్‌ఘన్‌పూర్’కు ఉప ఎన్నిక అనివార్యమేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి అనర్హత ముప్పు పొంచి ఉందా..? ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతటా ‘అనర్హత’పైనే చర్చ..గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించించడం కలకలం రేపింది. దీంతో స్టేషన్ ఘన్పూర్ టికెట్ పొందడం మొదలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం... తాజాగా హైకోర్టు తీర్పు వెలువడే వరకు పలుమార్లు కడియం శ్రీహరి పతాక శీరి్షకలకెక్కారు. హైకోర్టు తీర్పు మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశమే ఎక్కువుందన్న చర్చ ఒక పక్కన.. స్పీకర్ కార్యాలయం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ మరో పక్కన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అన్న ఉత్కంఠ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎవరి ధీమా వారిదే... బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా.టి.రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఎవరికీ వారుగా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి..బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న. నాలుగు వారాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి.– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రిడివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్తాంనాకు కోర్టుపైన నమ్మకం వుంది.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ది. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యేనిబద్ధత ఉంటే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి..బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. కడియం శ్రీహరి, కావ్యలు నియోజకవర్గానికి ఎంత చేసిన తక్కువే. నియోజకవర్గ ప్రజలకు వారు రుణపడి ఉండాలి. – డా.టి.రాజయ్య, మాజీ మంత్రి -
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్‌కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
నాన్నే నా ధైర్యం
‘సాధించాలన్న పట్టుదల, ఆశయ సాధన కోసం శ్రమించే తీరు.. ఇవన్నీ నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు. ముక్కుసూటిగా మాట్లాడే నాన్నంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం. ఆయనే నా ధైర్యం.. నాన్న పక్కన ఉంటే కొండంత అండ ఉంటుందనిపిస్తుంది’ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అంటున్నారు. కూతురిని తన వారసురాలిగా రాజకీయాల్లోకి తీసుకురావాలని, తనలా ప్రజాప్రతినిధి చేయాలన్న తండ్రి కల నెరవేరింది. మొదటినుంచి తన వెన్నెముకగా నిలిచి కూతురిని రాజకీయ అరంగ్రేటం చేయించి పక్కా ప్రణాళికతో విజయం సాధించారు. తండ్రి ఆశయం మేరకు కూతురు కావ్య ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి వరంగల్ రెండో మహిళా పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టారు. నేడు (ఆదివారం) ఫాదర్స్ డేని పురస్కరించుకుని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఆమె తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న ఆప్యాయత, అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. హన్మకొండ చౌరస్తా: మేము నాన్నకు ముగ్గురు కావ్య, దివ్య, రమ్య కూతుళ్లం. నాన్న హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవారు. సరిగ్గా నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ నాన్న మా ముగ్గురిని చాలా గారాబంగా పెంచి, చదివించారు. ముగ్గురు ఆడపిల్లలు అన్న సామాజిక అంశం అక్కడక్కడ ప్రస్తావన వచ్చేది. అప్పుడు మానాన్న ఒక్కటే చెప్పేవారు నాకు ముగ్గురు మహాలక్ష్మీలు పుట్టారని చాలా సంతోషించేవాడు. నాన్న రాజకీయాల్లోకి వచ్చాక మాతో గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది కాదు. కానీ మా అవసరాలను ఎన్నడూ కాదనలేదు. ఎంత రాత్రి అయిన, ఉదయమైనా మా ముఖ కవళికలను బట్టే మాకు ఏం కావాలో తెలుసుకుని ఇచ్చేవారు. పదవ తరగతి పూర్తయ్యాక, ఇంటర్ ఆ తర్వాత హైదరాబాద్‌లోని డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నాన్నతో అన్నీ విషయాలను పంచుకునేదాన్ని. జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలన్న నాన్నతో చర్చించి, నిర్ణయం తీసుకోవడమే. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే నా భర్త(నజీర్) పరిచయం అయ్యాడు. ఇద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయాన్ని నాన్నకు చెప్పా. రెండు రోజులు ఆలోచించి నీ సంతోషమే నాకు ముఖ్యమంటూ మా పెళ్లికి అంగీకరించారు. పెళ్లి.. ఆ తర్వాత జాబ్ రీత్యా ఇద్దరం ఇక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు దియా, మెహిరా.సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు..ప్రజాప్రతినిధి హోదా ఉంటే ప్రజలకు, సామాజిక సేవ మరింత ఎక్కువ చేయొచ్చని అనిపించింది. ఈ విషయాన్ని 2016లో నాన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు నాన్న రాజకీయాలంటే అంత సులువు కాదు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని సర్దిచెప్పారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో సమయ స్ఫూర్తి, ఓర్పు ఉండాలని పదే పదే చెబుతుంటారు.మానసిక ధైర్యం నూరిపోశారు..నా జీవితంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలు మరిచిపోలేని తీపి గురుతులు. కడియం శ్రీహరి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన నాపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కొంత బాధగా అనిపించాయి. అప్పుడు నాన్న ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని పట్టించుకోవద్దని మానసిక ధైర్యం నూరిపోశారు. ఆత్మస్థైర్యంతో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నా. ఎంపీగా నా విజయం కోసం నాన్న ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను.ప్రతీక్షణం నా వెనుకాలే..రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో నాన్న ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు. ఎంపీ టికెట్ వచ్చిన మొదలు గెలిచే వరకు ఒకటీరెండు మీటింగులు తప్పితే అత్యధిక సమావేశాలు, సభలకు నాన్న నా వెంటే ఉంటూ నా వెన్నెముకలా నిలిచారు. సభల్లో ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలు ప్రస్తావించాలి.. మొదలు ప్రతిదీ చిన్నపిల్లలకు మాదిరిగా చెప్పేవారు. మడికొండలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రసంగించే సమయంలో నాన్న ఉన్నాడన్న ధైర్యమే నన్ను నిలబెట్టింది. డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆ కేసులతోనే.. డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే ఎక్కువ శాతం మహిళలు గర్భసంచి సమస్యతో బాధపడేవారు వచ్చేవారు. ఎందుకీ సమస్య అంటూ ఆరా తీయగా కౌమారదశలో వచ్చే పీరియడ్స్‌కు సరైన ప్యాడ్లు వినియోగించకపోవడమని తెలిసింది. ఆ సమస్యకు పరిష్కారం కోసం వెంటనే కడియం ఫౌండేషన్ ద్వారా బాలికలకు ప్యాడ్లు పంపిణీ చేయడం ప్రారంభించా. సంవత్సరంలో పదివేల మందికి ప్యాడ్లు పంచా. నాన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 6.5లక్షల మంది బాలికలకు పంపిణీ చేసినట్లు తెలిసింది. -
కడియం వద్దు.. రాజయ్యే ముద్దు
మడికొండ: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధి 46వ డివిజన్ రాంపూర్‌లో అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘కడియం వద్దు.. రాజయ్యే ముద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కడి యం ఏమీ చేయలేదని, రాజయ్య వచ్చాకే అభివృద్ధి జరిగింది అన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించలేదని పేర్కొన్నారు. రాజయ్య పై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్ తెచ్చుకున్న ఆయన మాదిగలను కాదని ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని, టికెట్ కెటాయిస్తే భారీ మోజార్టీతో గెలిపిచుకుంటా మని చెప్పారు. అంతకు ముందు రాంపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టా రు. కార్యక్రమంలో మునిగాల వెంకటయ్య, డేని యల్, తప్పెట సారయ్య, కడారి దేవయ్య, మాదా సి రమేష్, యాదగిరి, నర్సింగం, కమలేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పట్ల మహేష్, ఎర్ర సంపత్, నాగేష్, వెంకటస్వామి, మీసాల ఎల్లేష్, సాగర్, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. -
కొమురయ్య ఆత్మహత్యాయత్నం
శాయంపేట: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన వరంగల్ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన దామెరకొండ కొమురయ్య ఆత్మహత్యకు యత్నించాడు. నవంబర్ 6న శాయంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున జరిగిన ప్రచారసభలో కడియం ప్రసంగిస్తుండగా కొమురయ్య చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది రోజులపాటు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా, జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొమురయ్యను పోలీ సులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేసి సాయంత్రం వదిలేశారు. మంగళవారం ఉదయం మళ్లీ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొమురయ్య ఇంటికి వెళ్లారు. అనారోగ్యంగా ఉందని, పోలీస్‌స్టేషన్‌కు రాలేనని చెప్పగా, స్టేషన్‌కు రావాల్సిందేనని పోలీసు లు అనడంతో కొమురయ్య కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నిప్పం టించుకోకుండా వెంటనే పోలీ సులు వారించారు. చెల్పూరులో కేసీఆర్ బహిరంగసభ అయిపోయే వరకు కొముర య్య గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా పోలీ సులు కాపలా కాశారు. -
కేంద్రంతో కలసి పనిచేస్తాం
♦ టీమ్ ఇండియాలో భాగస్వాములమవుతాం: సీఎం కేసీఆర్ ♦ తెలంగాణకు గడ్కరీ 1,800 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చారు ♦ ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ♦ గడ్కరీతో కలసి గోదావరిపై నిర్మించిన ముల్లకట్ట వంతెనకు ప్రారంభం ♦ ఆలేరు-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన ♦ నేడు, రేపు వరంగల్ పర్యటనలోనే సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు కావాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన టీం ఇండియాలో భాగస్వాములమవుతాం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా మడికొండలో సీఎం కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసి ఆలేరు-వరంగల్ జాతీయ రహదారి(163) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లకట్ట-ఖమ్మం జిల్లా పూసురు మధ్య గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను కూడా మడికొండలోనే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ పరిస్థితి దయనీయంగా ఉంది. దక్షిణ భారత దేశంలో జాతీయ రహదారులు సగటుతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువగా 2.25 శాతమే ఉన్నాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు గడ్కరీకి దీనిపై వివరాలు ఇచ్చాను. ఇది అన్యాయం... ఇలా ఉండకూడదని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో కోరినదాని కన్నా 110 కిలోమీటర్లు ఎక్కువగా జాతీయ రహదారులు కావాలని అడిగాను. 1,800 కిలో మీటర్లు మేరకు జాతీయ రహదారులు ఇచ్చారు. అందుకు గడ్కరీకి కృతజ్ఞతలు. గడ్కరీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఈ విషయంతో ఆయన చరిత్రలో నిలిచిపోతారు’’ అని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో సీసీఐ తెరిపించండి రూ.340 కోట్లతో గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించామని, 99 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామని సీఎం చెప్పారు. ఇవి త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ‘‘ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేను పూర్తి చేసిన అనుభవం గడ్కరీకి ఉంది. ఈ అనుభవంతోనే దేశంలోని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశంలో 350 రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లను మంజూరు చేస్తే వాటిలో 12 తెలంగాణలో ఉన్నాయి. మరికొన్ని బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరుతున్నా. ఎక్కడెక్కడ మంజూరు చేయాలనే విషయంపై వినతులు ఇస్తాం. గోదావరిలో జల రవాణా కోసం రాష్ట్రం తరఫున త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) హైదరాబాద్‌లో ఉంది. దీన్ని తెరిపించేందుకు కృషి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేస్తున్నా. మహారాష్ట్రలో వెస్టర్స్ కోల్డ్ ఫీల్డ్‌లో కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతతో యూరియా తయారు చేస్తున్నారు. మా దగ్గర ఇలా చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, అనుమతులను ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు. వరంగల్‌లో గిరిజన వర్సిటీ ‘‘హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. ఇక్కడ ఇప్పటికే ఆరోగ్య వర్సిటీ, సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి. త్వరలో గిరిజన వర్సిటీ రాబోతోంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వరంగల్ అభివృద్ధి చెందుతుంది’’ అని సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జి.పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి తిండి తింటారో వారి పేరు తల్చుకుంటారు. అట్లనే తమతో పెట్టుకున్న వారిపై పోరాడతారు. (తెలంగాణ కే జనతా జిస్కా కాతా హై ఉస్ కా గాతా హై. జో హమారే సే లడ్తా హై జిస్ సే దిలో జహా సే లడ్తా హై..) - వరంగల్ జిల్లా మడికొండ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రెండ్రోజులు వరంగల్‌లోనే.. ముఖ్యమంత్రి సోమవారం రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేశారు. మంగళవారం కూడా వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలంలో చెల్పూరులో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం హన్మకొండకు చేరుకుంటారు. బుధవారం వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. -
త్వరలో ప్రైవేటు వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు వర్సిటీలు రాబోతున్నాయి. అందుకవసరమైన ముసాయిదా బిల్లులో ఉండాల్సిన అంశాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లుకు తుది రూపు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. బుధ లేదా గురువారం సమీక్షించి బిల్లును సిద్ధం చేయనున్నారు. సంప్రదాయ వర్సిటీల్లో కాలం చెల్లిన కోర్సులు కాకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సుల్ని చేర్చేందుకు ప్రైవేటు వర్సిటీలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ రాష్ట్రాన్ని, ప్రధానంగా హైదరాబాద్‌ను ‘ఎడ్యుకేషన్ హబ్’గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రైవేటు వర్సిటీలను అనుమతించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉంది. కార్పొరేట్ దిగ్గజాలు కూడా విద్యారంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి సంస్థలు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించగా, బిర్లా సంస్థ కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలూ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఉన్నత విద్యలో ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఉపాధి అవకాశాలు లభిం చనున్నాయి. దీంతో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులో ఉండనున్న కొన్ని ప్రధానాంశాలు ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం. ► జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం, పరస్పర సహకారం వీటి ద్వారా మరింత సులభం కానుంది. ► కోర్సులు, సిలబస్‌పై వర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక అవసరాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సులనే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ► సంస్థల అనుభవం, నైపుణ్యాలు, ట్రాక్ రికార్డును బట్టి వర్సిటీలకు అనుమతిస్తారు. ► విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంస్థలు చేసుకునే దరఖాస్తులు, ప్రతిపాదనలను నిపుణుల కమిటీ నేతృత్వంలో పరిశీలిస్తారు. సరిగ్గా లేదనుకుంటే తిరస్కరిస్తారు. ► ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై నియంత్రణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఉన్నత విద్య ప్రమాణాలు కాపాడటానికి ఈ సంస్థ చర్యలు చేపడుతుంది. ► అందులో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ, ఎంసీఐ, పీసీఐ, ఎన్ఏఏసీ, ఐసీఏఆర్, డీబీటీ, డీఎస్టీ, సీఎస్ఐఆర్, బీసీఐ వంటి సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. -
గ్రేటర్ ప్రణాళికలు సిద్ధం
ఐదు నియోజకవర్గాల్లో రూ.140 కోట్లతో 800 పనులు సీసీ రోడ్లకు అత్యధికంగారూ. 53 కోట్లు శ్మశాన వాటికలపై ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యేల ప్రతిపాదనల ఆధారంగా నివేదిక హన్మకొండ :వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో విస్తరించి ఉన్న ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం భారీ ప్రణాళిక సిద్ధమైంది. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనల ఆధారంగా దాదాపు రూ.140 కోట్లతో 800 పనులు చేపట్టేందుకు బల్దియా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. అత్యధికంగా వర్ధన్నపేటలో.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషను ఇటీవల 58 డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ల పరిధిలోఐదు శాసన సభ నియోజకర్గాలు ఉన్నాయి. వీటిలో 24 డివిజన్లు వరంగల్ తూర్పు, 23 డివిజన్లు వరంగల్ పశ్చిమ, 9 డివిజన్లు వర్ధన్నపేట, 2 డివిజన్లు పరకాల, ఒక గ్రామం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. తమ నియోజకర్గాల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు ఇప్పటికే అందచేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రతీ డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధం చేసింది. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకర్గం కార్పొరేషన్ చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలతో పోల్చితే అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది. సీసీ రోడ్లకు అత్యధిక వ్యయం ఐదు నియోజకవర్గాల పరిధిలో మౌలిక సదుపాయల కోసం రూ.139 కోట్ల వ్యయంతో ప్రధానంగా మౌలిక సదుపాయల కల్పనకే పెద్దపీట వేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, సీసీ డ్రైయిన్లు, పైపులైన్లు, శ్మశానవాటికల అభివృద్ధి, జంక్షన్ల విస్తరణ, లేబర్షెడ్, పార్కులు, వెండింగ్ జోన్లు, మార్కెట్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక వ్యయాన్ని సీసీరోడ్ల కోసం కేటాయించారు. మొత్తం రూ53.69కోట్ల వ్యయం తో 361 సీసీ రోడ్లు వేయాలంటూ ప్రతిపాదనలు అందగా.. దాదాపు అన్నింటికీ ఆమోదం లభించింది. సీసీ రోడ్ల తర్వాత డ్రైయిన్లకు ప్రాధాన్యత లభించింది. డ్రెయిన్ల కోసం రూ.29.02 కోట్లు వ్యయం చేస్తూ 201 పనులు చేపడతారు. మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ9.88 కోట్ల వ్యయంతో 67 ప్రాంతాల్లో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఉన్న శ్మశానవాటికలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 58 డివిజన్ల పరిధిలో రూ.18.69 కోట్ల వ్యయంతో 89 పనులు చేపడుతున్నారు. వీటిలో అత్యధికంగా రూ.4.14 కోట్ల 20 శ్మశానవాటిక లకు కొత్తరూపు రానుంది. అత్యంత తక్కువగా వెండింగ్ జోన్లు, పార్కులు, లేబర్షెడ్లకు నిధుల కేటాయింపు జరిగింది. -
ఎంపీ స్థానం మాదిగకే..
భూ పంపిణీ కోసం సర్వే జరుగుతోంది ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి వరంగల్ ఎంపీ స్థానం ముమ్మాటికి మాదిగలకే ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలో బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీహరి మాట్లాడారు.. - హన్మకొండ చౌరస్తా హన్మకొండ చౌరస్తా : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, టీడీపీ హయూంలో తాను వర్గీకరణ కోసమే మంత్రి పదవిని వదులుకున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తన పిల్లలకు వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించడం లేదని, ఇది మాదిగలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతానని స్పష్టంచేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సమితి(టీఎస్) ఆధ్వర్యంలో హన్మకొండలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశాక కొందరు దిక్కుతోచని స్థితిలో మందకృష్ణ పడిపోయూరని ఎద్దేవా చేశారు. మందకృష్ణ ఒంటరిగా మిగిలాడన్నారు. దళితులకు భూ పంపిణీ కోసం అర్హుల జాబితా సిద్ధమవుతోందని తెలిపారు. దళితులు తమ పిల్లలకు చదువు అందించాలని కోరారు. త్యాగాలు చేసే ఘనత మాదిగలదే: రాజయ్య రైతాంగ సాయుధ పోరు, 1969 తెలంగాణ, నేటి మలిదశ ఉద్యమాల్లో ముందుండి పోరాడింది, త్యాగాలు చేసింది మాదిగలేనని, తాను మాదిగగా పుట్టినందుకు గర్విస్తున్నానని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మాదిగ కళాకారులు లేనిది టీఆర్ఎస్ మీటింగ్ లేదన్నారు. డబ్బు ఆశ చూపించినా కాంగ్రెస్ పార్టీని, పదవిని వదిలి ఉద్యమంలోకి వచ్చానని చెప్పారు. రిజర్వేషన్లు ఉపయోగించుకుని దళితులంతా చదవాలని ఆకాం క్షించారు. ఆ ఘనత ఎమ్మార్పీఎస్‌దే: ఎమ్మెలే అరూరి వర్గీకరణ కోసం అందరిని ఏకతాటికి పైకి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్దేనని ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మందకృష్ణది చంద్రబాబుతో చీకటి ఒప్పందమని ఆరోపించారు. మాదిగల పైనే దాడి చేయించిన ఘనత మందకృష్ణదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మార్పీఎస్ గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య, డాక్టర్ రాజమౌళి, చింతల యాదగిరి, మేడి పాపయ్య, చింతల మల్లికార్జున్, కన్నం సునీల్, అర్శం అశోక్, గడ్డం సమ్మయ్య, పత్రి వెంకటయ్య, జీవీదాస్, చాట్ల నరేష్, తూర్పాటి సారయ్య, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. సభలో కళాకారులు గిద్దె రాంనర్సయ్య, వేపూరి సోమన్న, దారా దేవేందర్ ఆటాపాటా ఆకట్టుకుంది. సభకు వర్షం కాస్త ఆటంకం కలిగించింది. -
నీకు బుద్ధి లేదు.. నీకే లేదు..!
కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం వరంగల్ జెడ్పీ సమావేశం రసాభాస హన్మకొండ : వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రాజకీయ నాయకుల పరస్పర దూషణకు వేదికగా మారింది. రాజకీయ ఎత్తుగడలకు ఈ సమావేశాన్ని పావుగా వాడుకున్నారు. టీఆర్ఎస్, టీడీపీ నాయకులు సభా మర్యాదలు మరిచి ఒకరినొకరు ‘నీకు సిగ్గులేదు.. నీకు బుద్ధిలేదు’ అంటూ దూషించుకున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో యూరియా కొరతపై ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి ద యాకర్‌రావు, రెడ్యానాయక్ అధికారులను నిల దీశారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలను సరిగా చెప్పలేకపోతున్నారం టూ అధికారులపై ఎంపీ కడియం శ్రీహరి మం డిపడ్డారు. అయితే, ఎంపీ చర్చను పక్కదారి పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆక్షేపించారు. దీనిపై కడియం శ్రీహరి మాట్లాడు తూ సీనియర్ ఎమ్మెల్యే ఇలా మాట్లాడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్ష సభ్యులను దబాయిస్తున్నావేంటి అం టూ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ‘నీకు బుద్ధిలేదు, నీకు సభ్యత లేదు’ అంటూ ఎర్రబెల్లి, కడియం పరస్పరం దూషిం చుకున్నారు. తొమ్మిదేళ్లు మంత్రిగా ఉండి నువ్వు ఏం...(రాయలేని పదాన్ని వినియోగించారు) అంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రతిగా టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ఎందుకు మా వెంట తిరుగుతున్నావ్ అంటూ కడియం హెచ్చు స్వరంతో ధ్వజమెత్తా రు. ఇద్దరి వాదన శృతి మించడంతో జిల్లాపరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ జి.కిషన్, జెడ్పీటీసీ సభ్యులు వారిని సముదాయించారు.